మొదటి నుంచి వివాదాస్పదంగా మారిన అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్ను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిలిపి వేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
తిరుపతి : మొదటి నుంచి వివాదాస్పదంగా మారిన అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్ను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిలిపి వేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అయితే ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు స్వామివారికి బహూకరించిన విరాళాలను భక్తులు కోరితే వెనక్కు ఇస్తామని తెలిపింది. లేకుంటే మరో పథకంలోకి మళ్లిస్తామని వెల్లడించింది.
ఈ మేరకు స్వర్ణమయం పథకం ద్వారా విరాళాలు ఇచ్చిన భక్తులకు ఇప్పటికే టిటిడి సమాచారం అందించామని...కొంతమంది స్పందించారని మరోసారి భక్తులకు సమాచారం చేరవేస్తామని టిటిడి ఈఓ సాంబశివరావు తెలిపారు. డైయిల్ యువర్ ఈఓ కార్యక్రమం సందర్భంగా అన్నమయ్య భవన్‌లో మీడియాతో ఈవో మాట్లాడారు. కాగా 2008 అక్టోబర్ 1వ తేదీన అనంత స్వర్ణమయం పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే.