టీటీడీపీ నేతలపై వేణుగోపాలచారి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు ఇవ్వడం లేదని, కేంద్ర మంత్రులను కలవలేదని తెలంగాణ టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలచారి దుయ్యబట్టారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. శుక్రవారం ఇక్కడి తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతల తీరు ఢిల్లీలో తెలంగాణ ప్రజల పరువుతీసేలా ఉందని ఆయన విమర్శించారు.
సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ ఎంపీల బృందంతో కలిసి ప్రధానమంత్రిని కలిశారని, 21 అంశాలపై వినతిపత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలు, ప్రత్యేక ప్రతినిధులంతా తరచూ కేంద్ర మంత్రులను వివిధ అంశాలపై కలుస్తూనే ఉన్నామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా..టీడీపీ నాయకులు సిగ్గులేకుండా, ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు.
ఢిల్లీలో తెలంగాణ పరువు తీశారు
Published Sat, Nov 1 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM
Advertisement