venugopala chari
-
రాజకీయ ఉనికి కోసమే ఉత్తమ్ యాత్రలు
వేణుగోపాలాచారి ధ్వజం సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణలో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ రైతు బాట పేరిట యాత్రలు చేపడుతున్నా రని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి విమర్శిం చారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడు తూ.. రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే కాంగ్రెస్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కళ్లు ఉండికూడా అభివృద్ధిని చూడలేని గుడ్డివాళ్లు కాంగ్రెస్ నాయకులన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టు బాటు ధర కల్పించడానికి, క్షేత్ర స్థాయిలో రైతులు ఎదు ర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే రైతు సమితులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. -
త్వరలో ఉమ్మడి భవన్ విభజన కొలిక్కి
ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఉమ్మడి భవన్ విభజన త్వరలో ఒక కొలిక్కి వస్తుందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ భవన్ విభజన విషయంలో తెలంగాణ ప్రభుత్వం శాంతియుతంగా వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భవన్‌కు ఉద్యోగుల కేటాయింపుపై దృష్టి పెట్టిందని చెప్పారు. ఇక ఢిల్లీలో రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వేడుకలకు కేంద్ర మంత్రులు, వివిధ దేశాల భారత రాయబారులు హాజరవుతారని చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ భవన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.2 కోట్లతో 12 కొత్త వాహ నాలను కేటాయించింది. వీటిలో 5 ఇన్నోవా, 5 మారుతి సూయిజ్, 2 బొలెరో వాహనాలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామ చంద్రు తేజావత్, భవన్ రెసిడెంట్ కమిషన్ అరవింద్ కుమార్ ప్రారంభించారు. -
ఢిల్లీలో తెలంగాణ పరువు తీశారు
టీటీడీపీ నేతలపై వేణుగోపాలచారి ఫైర్ సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు ఇవ్వడం లేదని, కేంద్ర మంత్రులను కలవలేదని తెలంగాణ టీడీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలచారి దుయ్యబట్టారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. శుక్రవారం ఇక్కడి తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత జితేందర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతల తీరు ఢిల్లీలో తెలంగాణ ప్రజల పరువుతీసేలా ఉందని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీల బృందంతో కలిసి ప్రధానమంత్రిని కలిశారని, 21 అంశాలపై వినతిపత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు, ప్రత్యేక ప్రతినిధులంతా తరచూ కేంద్ర మంత్రులను వివిధ అంశాలపై కలుస్తూనే ఉన్నామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా..టీడీపీ నాయకులు సిగ్గులేకుండా, ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు.