
'టీడీపీలో ఎందరుంటారో చూస్కో'
హైదరాబాద్:తెలంగాణ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏనాడు తెలంగాణ ఉద్యమంలో భాగం కాని రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ ను విమర్శించే స్థాయి లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఏ రోజూ పనిచేయలేదన్నారు. టీడీపీ సభ్యులు చేజారుతారన్న భయంతోనే టీఆర్ఎస్ నేతలపై రేవంత్ విమర్శలకు దిగుతున్నారన్నారు.
జూన్ 1వ తేదీ తరువాత టీడీపీలో ఎంతమంది సభ్యులుంటారో చూస్కో అంటూ సుధాకర్ రెడ్డి సవాల్ విసిరారు. టీఆర్ఎస్ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.