
ఆంధ్రాపాలకుల కేసులే టీఆర్‌ఎస్ అస్త్రాలా?
టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం లో ఆంధ్రాపాలకులు పెట్టిన కేసులను జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్‌ఎస్ అస్త్రాలుగా వాడుకోవడం దేనికి సంకేతమని టీటీడీపీ నేత ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నిం చారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న నిర్బంధ, అణచివేత విధానాలతో సమైక్య రాష్ట్ర పాలకుల కంటే క్రూరంగా వ్యవహరిస్తు న్నారని ఆరోపించారు.
జేఏసీ ర్యాలీకి అనుమతినివ్వకపోవడం నియంతృత్వ పోకడలకు నిద ర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా సమైక్య పాలకులు అక్రమంగా పెట్టిన కేసులను సాకుగా చూపిస్తూ నిరుద్యోగ యువకులను నేరస్తులుగా, తీవ్రవాదులుగా చిత్రీకరించడం దారుణమన్నారు.