సాక్షి, హైదరాబాద్ : మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న రేవంత్ రెడ్డి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న తెలుగుదేశం పార్టీని చావుదెబ్బకొట్టబోతున్నారా? భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఆయన వెంట వెళ్లనున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. నేటి(సోమవారం) సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న రేవంత్‌రెడ్డి రేపు(మంగళవారం) రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. దాదాపు అన్ని జిల్లాల నుంచి కీలక నేతలుగా ముద్రపడినవారిలో అధికులు రేవంత్ వెంట నడవబోతున్నట్లు తెలిసింది. వీరందరి కోసం ఇప్పటికే ఢిల్లీ కర్ణాటక భవన్‌లో గదులు బుక్ చేసినట్లు సమాచారం.
వైరల్ జాబితా : రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరబోతున్న నాయకులు వీరేనంటూ కొద్ది గంటలుగా సోషల్ మీడియాలో ఓ జాబితా వైరల్ అయింది. లిస్ట్ ఏ, లిస్ట్ బి గా వర్గీకరించిన ఆ జాబితాలో నాయకుల పేర్లు, జిల్లా, ప్రస్తుతం టీడీపీలో వారి స్థానం, కులం, మతం తదితర వివరాలన్నీ పొందుపర్చి ఉన్నాయి. కాగా, ఆ జాబితాలోని వారిలో వేం నరేందర్ రెడ్డి ఒక్కరే బాహాటంగా రేవంత్‌కు మద్దతు పలికి, టీడీపీకి రాజీనామా చేశారు. మిగిలినవారంతా రేపు నేరుగా పార్టీ మారబోతున్నట్లు సమాచారం.
టీడీపీకి చావుదెబ్బే! : రేవంత్ వెంట వెళ్లబోయేవారిగా ప్రచారంలో ఉన్న జాబితాలో .. మాజీ మంత్రులు మొదలుకొని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మొన్నటి ఎన్నికల్లో అభ్యర్థులు, మాజీ కార్పొరేటర్లు, విద్యార్థి సంఘం నేతల వరకు ఉన్నారు. వీరిలో చాలా మంది పాపులర్ నేతలేకాక, కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారే కావడం గమనార్హం. వారంతా ఇప్పుడు కాంగ్రెస్‌లోకి చేరుతుండటం టీడీపీకి చావుదెబ్బే అన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. మిగిలిన ముఖ్యనేతలు కూడా అతిత్వరలోనే ప్రత్యామ్నాయ వేదికలు చూసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
చర్చనీయాంశమైన ‘రేవంత్ జాబితా’ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment