
సాక్షి, ఖమ్మం: మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావుతో అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు భేటీ అయ్యారు. మెచ్చా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరి భేటికి ప్రాధాన్యత సంతరించికుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మెచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. దీనిపై సండ్ర కొంత సానుకూల సంకేతాలు ఇచ్చినప్పటికీ.. మెచ్చా మాత్రం ఈ వార్తను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చే బాధ్యతలను సీఎం తన సన్నిహితులకు అప్పగించినట్టు సమాచారం. తాజగా తమ్మలతో మెచ్చా భేటీ కావడంతో.. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment