మంత్రి పదవి కోసం తుమ్మల ఆత్రం! | Tummala nageswara rao eagerly waiting for minister post | Sakshi
Sakshi News home page

మంత్రి పదవి కోసం తుమ్మల ఆత్రం!

Published Thu, Oct 16 2014 12:08 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

మంత్రి పదవి కోసం తుమ్మల ఆత్రం! - Sakshi

మంత్రి పదవి కోసం తుమ్మల ఆత్రం!

హైదరాబాద్ : సైకిల్ దిగి కారు ఎక్కిన తుమ్మల నాగేశ్వరరావు ఆత్రంగా ఉన్నారు. మంత్రి పదవిపై హామీతోనే టీఆర్ఎస్లో చేరిన ఆయన పార్టీలో చేరి రెండు నెలలు అయినా మంత్రి పదవి రాకపోవటంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి తర్వాత మంత్రి వర్గ విస్తరణలో అయినా తనకు చోటు దక్కుతుందని తుమ్మల ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు నవంబర్ మూడోవారంలో  కేబినెట్ విస్తరణలో తుమ్మలకు చోటు ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు.

ఇక ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతం కావాలంటే అక్కడ బలమున్న నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్....తుమ్మలను కేబినెట్లో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు కేవలం తుమ్మలతోనే ఆయన విస్తరణను సరిపెడతారనే వార్తలు వినిపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement