cabinet expantion
-
మమత మార్క్ రాజకీయం.. బీజేపీ మాజీ ఎంపీకి మంత్రివర్గంలో చోటు!
కోల్‌కతా: పాఠశాల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బుధవారం మధ్యాహ్నం ఐదుగురు కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేశారు. అందులో బీజేపీ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియోకు చోటు కల్పించారు దీదీ. గత ఏడాదే బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు బాబుల్ సుప్రియో. బాబుల్ సుప్రియోతో పాటు స్నేహాశిష్ చక్రబర్తి, పార్థా బౌమిక్, ఉదయాన్ గుహా, ప్రదిప్ మజందెర్లు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారికి కీలక శాఖలు కేటాయించనున్నారని సమాచారం. స్నేహాశిష్ చక్రబర్తి ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. హూగ్లీ జిల్లాలో ఇంఛార్జ్‌గా సేవలందిస్తున్నారు. పార్థా బౌమిక్ మూడు సార్లు నైహాతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉదయాన్ గుహా ఫార్వర్డ్ బ్లాక్ నేత, 2016లో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. పార్థా ఛటర్జీ అరెస్ట్ నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు మమతా బెనర్జీ. ఆయన నిర్వహించిన పారిశ్రామిక, వాణిజ్య, పార్లమెంటరీ వ్యవహారాల వంటి ఐదు కీలక శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణపై మంగళవారం ప్రకటన చేసిన దీదీ.. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 23 నుంచి 30కి పెంచుతున్నట్లు తెలిపారు. సుబ్రతా ముఖర్జీ, సధన్ పాండేలను కోల్పోయామని, పార్థా చటర్జీ జైలుకు వెళ్లిన క్రమంలో వారికి సంబంధించిన శాఖలను తాను మోయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Gujarat Elections 2022: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి ఇద్దరు కీలక నేతలు! -
పంకజా, ప్రీతం మద్దతుదారుల రాజీనామా
సాక్షి, ముంబై: కేంద్ర మంత్రి మండలి విస్తరణలో స్థానం దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ బీజేపీ ఎమ్మెల్యే పంకజా ముండే, ఎంపీ ప్రీతం ముండేల మద్దతుదారులు సుమారు 20 మందికిపైగా పైగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. బీడ్ జిల్లాకు చెందిన వీరంతా రాజీనామాలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడేక్కింది. అసంతృప్తి లేదంటూనే.. కేంద్ర మంత్రిమండలి విస్తరణ అనతంరం మంత్రి మండలిలో స్థానం దక్కకపోవడంపై దివంగత సీనియర్ బీజేపీ నేత గోపీనాథ్ ముండే కూతుళ్లు పంకజా ముండే, ప్రీతం ముండేలు అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమి లేదని ఆ వార్తలన్నీ అవాస్తవమంటూ ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ కొట్టిపడేశారు. మరోవైపు పంకజా ముండే కూడా విలేకరుల సమావేశం నిర్వహించి ఎలాంటి నిరాశ లేదని, అదేవిధంగా అసంతృప్తి కలగలేదంటూ ఈ వార్తలకు విరామం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ముండే మద్దతుదారులు మాత్రం శనివారం బీజేపీలో తమ పదవులకు రాజీనామాలు చేయడం కలకలం సృష్టించింది. ముఖ్యంగా బీడ్ జిల్లా పరిషత్ సభ్యురాలు సవితా బడే, పంచాయతి సమితి సభ్యులు ప్రకాష్ ఖోడ్కర్, బీజేపీ విద్యార్థి ఆఘాడీ జిల్లా అధ్యక్షుడు సంగ్రామ్ బంగార్, బీజేపీ బీడ్ జిల్లా ఉపాధ్యక్షుడు వివేక్ పాఖరేతోపాటు డా. లక్ష్మణ్ జాధవ్ తదితరులు తమ పదవులకు రాజీనామా చేశారు. -
విస్తరణకు వేళాయే..హరీశ్‌కు ఛాన్స్!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆదివారం దశమి కావడంతో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయించారు. రాజ్ భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియామకమైన తమిళ సై సౌందర్‌రాజన్ కు కూడా మంత్రి వర్గ విస్తరణ సమాచారాన్ని ముఖ్యమంత్రి తెలియజేశారు. కాగా విస్తరణలో భాగంగా మరో నలుగురికి మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరీశ్‌రావుతో పాటు కేటీఆర్‌కు చోటు కల్పించినట్లు సమాచారం. ఒక మహిళకు కూడా మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలపై కౌంటర్ ఇచ్చే మంత్రులు ఎవరూ లేకపోవడంతో హరీశ్, కేటీఆర్‌లను మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కొత్త గవర్నర్ చేతుల మీదుగా ఆదివారం ప్రమాణ స్వీకారం జరగనుంది. మరోవైపు ఈ నెల 9న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ చీఫ్ విప్, విప్‌లను నియమించారు. ప్రభుత్వ చీఫ్ విప్‌గా దాస్యం వినయ్‌భాస్కర్, విప్‌లుగా గొంగిడి సునీత, గంప గోవర్థన్, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధీ, రేగ కాంతరావు, బాల్క సుమన్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. -
ఇక్కడ వ్యతిరేకించి అక్కడ పదవులిస్తారా?: లోక్‌సత్తా
సాక్షి, హైదరాబాద్: ఏపీ కేబినెట్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై విమర్శలు వెళ్లువెత్తున్నాయి. రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు ఇవ్వడంపై పలు రాజకీయపార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గంలో ఫిరాయింపుదారులకు చోటివ్వడంపై లోక్‌సత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై హైడ్రామా చేసిన చంద్రబాబు, ఏపీలో ఫిరాయించిన నేతలకు మాత్రం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అనైతికత, ప్రజాస్వామ్య అపహాస్యానికి ప్రస్తుత పరిస్థితి స్పష్టం చేస్తోందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే స్పీకర్, గవర్నర్లు సైతం ఈ ఫిరాయింపులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వాలకు ప్రజలు తగిన విధంగా బుద్ది చెబుతారని ఆయన అన్నారు. -
విస్తరణలో సామాజిక అన్యాయం: రఘువీరా
సాక్షి, అమరావతిః మంత్రివర్గ విస్తరణతో సీఎం చంద్రబాబు కుల సమీకరణాలకే పెద్దపీట వేశారని ఏపీ పీసీసీ అధ్యక్ష్యులు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. ముస్లింలకు, వెనుకబడిన కులాలకు, గిరిజనలను విస్మరించి సామాజికంగా అన్యాయం చేశారని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నలుగురికి నీతులు చెప్పడానికి ముందు ఆ వ్యక్తి నైతిక విలువలు కలిగి ఉండాలని అందరికీ చెప్పే చంద్రబాబు ఆ విలువలకు తిలోదాకలిచ్చారని ఆయన దుయ్యబట్టారు. సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తప్పుపట్టిన చంద్రబాబు నేడు అదేపని చేసి రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలిచ్చారని విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం బాధాకరమని రఘువీరా అన్నారు. -
ముహూర్తం ఖరారు
► ఏప్రిల్ 2న మంత్రివర్గ విస్తరణ ఖాయమంటున్న సర్కారు ► జిల్లాకు మరో మంత్రి పదవి దక్కేనా..? ► మాగుంటకు మండలి చైర్మన్, లేదా మంత్రి పదవి.. ► శిద్దా రాఘవరావు శాఖలో మార్పునకు అవకాశం ► జిల్లా ఇన్చార్జ్ మంత్రి రావెలకు పదవీగండం! సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఏప్రిల్ 2న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న ప్రకటనతో జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందా.. రాదా అన్నవిషయం చర్చ నీయాంశంగా మారింది. నిన్నమొన్నటి వరకూ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. తాజాగా మంత్రి పదవి కాకుండా ఆయనకు మండలి చైర్మన్ పదవి ఇవ్వనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు జిల్లాకు రెండో మంత్రి పదవి లేదన్న ప్రచారమూ సాగుతోంది. జిల్లా నుంచి ఇప్పటి వరకూ శిద్దా రాఘవరావు ఒక్కరే మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఎమ్మెల్సీ మాగుంటకు మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరిగింది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు మాటిచ్చినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. నెల్లూరు జిల్లాకే చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే మాగుంటకు సమీకరణాలను బట్టి మండలి చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రెడ్డి సుబ్రమణ్యంకు మండలి వైస్ చైర్మన్ పదవి కట్టబెట్ట నుండడంతో చైర్మన్ పదవి రెడ్డి సామాజికవర్గానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అందుకు మాగుంట సమర్ధుడని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. మాగుంట మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. సభా నియమ, నిబంధనలపై అవగాహన ఉంది. సౌమ్యుడు, అన్ని వర్గాల నుంచి సానుకూలత, సభను సజావుగా నడిపించే అవకాశం ఉంటుందనే అంశాలను బేరీజు వేసి ఆయనను మండలి చైర్మన్ చేస్తారా.. లేక మంత్రి పదవి ఇస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. శిద్దా శాఖలు మారనున్నాయా..!: జిల్లాకు మరో మంత్రి పదవి ఇచ్చినా.. ఇవ్వక పోయినా మంత్రి శిద్దా రాఘవరావు శాఖల్లో మార్పు ఉంటుందన్న ప్రచారం ఉంది. ముఖ్యంగా రవాణాశాఖ లేదా రోడ్లు, భవనాల శాఖల్లో ఒక శాఖను ఆయన నుంచి తప్పించే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే శిద్దాపై ముఖ్య మంత్రికి సదాభిప్రాయమే ఉంది. నమ్మిన బంటుగా ఉన్న శిద్దా కోరుకున్నట్లే ముఖ్యమంత్రి నడుచుకునే అవకాశముందని, శిద్దాకు ఇష్టంలేని పక్షంలో ఆయన శాఖల్లో మార్పులు ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాల సమాచారం. రావెల పదవికి ఎసరు..: జిల్లా ఇన్చార్జి మంత్రి రావెల కిషోర్‌బాబును మంత్రి వర్గం నుంచి తప్పించడం ఖాయమన్న ప్రచారం ఉంది. మంత్రి రావెల పనితీరుపై ముఖ్యమంత్రి ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయనను తప్పించి, మరొకరికి మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే రావెలకు జిల్లా ఇన్చార్జి పదవి కూడా ఊడటం ఖాయంగా కనిపిస్తోంది. -
కేంద్రమంత్రి రేసులో ముగ్గురు టీడీపీ ఎంపీలు
హైదరాబాద్ : కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మరో మంత్రి పదవి కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ మరో మంత్రి పదవిని కోరనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయంపై మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి ప్రస్తుతం పి.అశోక్ గజపతిరాజు (పౌరవిమానయాన శాఖ) ఒక్కరే కేంద్రమంత్రిగా ఉన్నారు. తాజాగా మరో మంత్రి పదవి కోసం టీడీపీ ప్రయత్నాలు సాగిస్తోంది. దాంతో కేంద్రమంత్రి రేసులో టీడీపీ ఎంపీలు నల్ల మల్లారెడ్డి, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఉన్నట్లు సమాచారం. అయితే వీరిలో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే ఇంకా తెలియాల్సి ఉంది. -
మంత్రి పదవి కోసం తుమ్మల ఆత్రం!
-
మంత్రి పదవి కోసం తుమ్మల ఆత్రం!
హైదరాబాద్ : సైకిల్ దిగి కారు ఎక్కిన తుమ్మల నాగేశ్వరరావు ఆత్రంగా ఉన్నారు. మంత్రి పదవిపై హామీతోనే టీఆర్ఎస్లో చేరిన ఆయన పార్టీలో చేరి రెండు నెలలు అయినా మంత్రి పదవి రాకపోవటంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి తర్వాత మంత్రి వర్గ విస్తరణలో అయినా తనకు చోటు దక్కుతుందని తుమ్మల ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు నవంబర్ మూడోవారంలో కేబినెట్ విస్తరణలో తుమ్మలకు చోటు ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలోపేతం కావాలంటే అక్కడ బలమున్న నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్....తుమ్మలను కేబినెట్లో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేవలం తుమ్మలతోనే ఆయన విస్తరణను సరిపెడతారనే వార్తలు వినిపిస్తున్నారు.