
కేంద్రమంత్రి రేసులో ముగ్గురు టీడీపీ ఎంపీలు
కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మరో మంత్రి పదవి కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ మరో
హైదరాబాద్ : కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మరో మంత్రి పదవి కోసం తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ మరో మంత్రి పదవిని కోరనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం ప్రధాని మోదీని కలవనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయంపై మోదీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కాగా ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి ప్రస్తుతం పి.అశోక్ గజపతిరాజు (పౌరవిమానయాన శాఖ) ఒక్కరే కేంద్రమంత్రిగా ఉన్నారు. తాజాగా మరో మంత్రి పదవి కోసం టీడీపీ ప్రయత్నాలు సాగిస్తోంది. దాంతో కేంద్రమంత్రి రేసులో టీడీపీ ఎంపీలు నల్ల మల్లారెడ్డి, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఉన్నట్లు సమాచారం. అయితే వీరిలో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే ఇంకా తెలియాల్సి ఉంది.