పార్లమెంట్‌లో తెలుగుదేశం ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీకి చెందిన ఎంపీలు మండిపడ్డారు.
ఢిల్లీ: పార్లమెంట్‌లో తెలుగుదేశం ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీకి చెందిన ఎంపీలు మండిపడ్డారు. ఎంపీల వేటుకు సంబంధించి సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఎంపీలనే సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు. నందమూరి హరికృష్ణ విషయంలో చాలా తొందరగా రాజీనామాను ఆమోదించారని వారు తెలిపారు. భావోద్వేగంతో చేసిన హరికృష్ణరాజీనామాను ఎలా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రత ఎక్కువగా ఉందన్నారు.