- టీటీడీపీ నేతల్లో ఆందోళన
- పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనూ సాగని సభ్యత్వ నమోదు
- నియోజకవర్గ నేతలపై ఒత్తిడి పెంచుతున్న పార్టీ ముఖ్యులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ఆదరణ కొరవడటంపై ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో 15 లక్షల మందితో సభ్యత్వం నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి లక్ష్యంలో మూడోవంతు అరుునా సాధ్యం అవుతుందా! అని ఆ పార్టీ నేతలే అనుమానపడుతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికోసం ఇప్పటికే ఆయా జిల్లాలకు టీడీపీ, అధ్యక్షులను కూడా ప్రకటించింది. నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదును లక్ష్యంగా పెట్టుకుని, నేతలకు బాధ్య తలను అప్పగించారు. అరుునా రాష్ట్రస్థారుులో సభ్యత్వ నమోదు ఆశాజనకంగా లేకపోవడం టీడీపీ ముఖ్యులను కలవర పరుస్తోంది.
హైదరాబాద్‌లోనూ కష్టమే..
జనాభా ప్రకారం రాష్ట్రంలో పెద్ద జిల్లా అరుున హైదరాబాద్‌లో లక్ష మంది సభ్యత్వాన్ని నమోదుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఇప్పటిదాకా 10 వేలను కూడా దాటలేదు. టీడీపీకి పట్టున్నదని భావిస్తున్న నియోజక వర్గాల్లోనూ సభ్యత్వ నమోదు ముందుకు కదలడం లేదు. సికింద్రాబాద్, సనత్‌నగర్ వంటి నియోజకవర్గాల్లోనూ సభ్యత్వ నమోదు మందకొడిగా సాగుతు న్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించారుు. హైదరా బాద్‌లో 15 అసెంబ్లీ నియోజక వర్గాలకుగాను ఒకలక్ష సభ్యత్వాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటిదాకా 10వేల మంది కూడా నమోదు కాలేదు. ఇదే పరిస్థితి మిగిలిన జిల్లాల్లోనూ ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, పాత రంగారెడ్డి జిల్లాలోనూ టీడీపీకి కొంత పట్టు ఉన్నట్టుగా చెబుతున్న ప్రాంతాల్లోనూ సభ్యత్వ నమోదు తీరు వారికి నిరాశను కలిగిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా వలసలతో టీడీపీ పూర్తిగా దెబ్బతిన్నదని, హైదరాబాద్‌లో లక్ష మంది సభ్యత్వం సాధ్యం కాదని ద్వితీయ శ్రేణి నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సభ్యత్వ నమోదు తీరును పరిశీలిస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భవిష్యత్ కార్యా చరణపై దృష్టి సారించారు. పార్టీబలంగా ఉన్న నియోజక వర్గాల్లోైనైనా సభ్యత్వం పెంచుకోవాలని నేతలకు వారు సూచనలు ఇస్తున్నారు. పార్టీ బలంగా ఉందని చెప్పు కోవడానికి సభ్యత్వాలను పెంచా ల్సిందిగా వారు ఒత్తిడిని పెంచు తున్నారని సమాచారం.
టీడీపీ సభ్యత్వానికి కొరవడిన ఆదరణ
Published Mon, Nov 28 2016 2:20 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
Advertisement
Advertisement