భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద టీడీపీ నేతల కోసం ఎదురు చూస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతలతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు విసిరిన సవాలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి ఈ మేరకు టీడీపీ నేతల కోసం వేచి ఉన్నారు. జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో పాటు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా టీడీపీ నేతల కోసం ఎదురు చూస్తున్నారు.