బీజేపీ చెలిమితో ఒరిగిందేమిటి?
⇒ కమలం పార్టీ తీరుపై టీటీడీపీలో అసంతృప్తి
⇒ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సాయం చేయడం లేదని కినుక
⇒ ఎన్నికల్లో బీజేపీ కోసం త్యాగాలు చేసినా లాభం ఏదని ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రంలో తమ పార్టీకి ఎలాంటి ప్రయో జనం లేదని టీటీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీతో గత ఎన్ని కల్లో పొత్తు సందర్భంగా ఎన్నో త్యాగాలు చేశామని, గెలిచే స్థానాలను కూడా పొత్తు లో భాగంగా బీజేపీకి ఇచ్చామని టీడీపీ నేతలు అంటున్నారు. హైదరాబాద్‌లో బీజేపీ గెలుచుకున్న 5 స్థానాల్లో 4 సీట్లను టీడీపీ బలంతోనే గెలిచారని చెబుతు న్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడంతో తెలంగాణలో పార్టీని బలోపే తం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆశించామని టీటీడీపీ నేతలు చెబుతు న్నారు.
టీడీపీ భాగస్వామిగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు దాటినా తెలంగాణ టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు ఎన్నికల తర్వాత పలు సందర్భాల్లో రాష్ట్రంలో టీడీపీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారని, కనీసం శాసనసభలో కూడా సమన్వయం లేకపోతే పొత్తు ధర్మానికి అర్థం ఏముందని ప్రశ్నిస్తున్నారు. శాసనసభలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ విధించిన సందర్భంలోనూ, పలు అంశా లపై ప్రభుత్వాన్ని నిలదీసే సమయం లోనూ బీజేపీ సభ్యులు మద్దతుగా ఉండటం లేదని అంటున్నారు. తెలంగా ణలో ముస్లింల ఓట్లు నష్టపోయి బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, పొత్తు వల్ల బీజేపీకి హైదరాబాద్‌లోనే సీట్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. అయినా రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి అవసరమైన సహాయం బీజేపీ నుంచి అందడం లేదని ఆరోపిస్తున్నారు.
మోత్కుపల్లికి గవర్నర్ పదవి వస్తున్నట్టేనా?
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవిని ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిఫారసు చేసినా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నారని అంటున్నారు. మోత్కుపల్లికి గవర్నర్ పదవికోసం అంత ర్గతంగా జరగాల్సిన ప్రక్రియ కూడా పూర్త యినట్టుగా ఎప్పటికప్పుడు చెబుతున్నా, పదవిని మాత్ర ఇవ్వడంలేదని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలకు యూపీఏ ప్రభుత్వం నియమిం చిన గవర్నర్లే కొనసాగుతున్నారని, అయి నా నర్సింహులుకు గవర్నర్ పదవి ఇవ్వ డానికి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడంలేదని అంటున్నారు.
సీనియర్లకు అవకాశం ఇస్తే పార్టీలో ఉన్నవారికి ఏదో ఒకసారి పదవులు వస్తాయనే విశ్వాసం పెరగడానికి దోహదం చేస్తుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ నేతలు అన్ని విధాలా లాభపడుతున్నా, ఇక్కడ మాత్రం సాయం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో దోస్తీవల్ల తమకు కలుగుతున్న ప్రయోజనం ఏమిటో అర్థంకావడంలేదని టీడీపీ నేతలు అంటున్నారు.