జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి
అబ్రహంరాయ్ మణి
విజయనగరం ఫోర్ట్: బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాడడమే కాంగ్రెస్ పార్టీ అజెండా అని జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి, ఏపీ యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి అబ్రహంరాయ్‌మణి అన్నారు. స్థానిక డీసీసీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగిన జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మూడేళ్లు అయినా ఒక్కహామీ కూడా నెరవేర్చలేదన్నారు.
యువజన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు వేగి వెంకటేష్ మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించాయన్నారు. పోలవరంను కేంద్రమే నిర్మించి ఇవ్వాలని చట్టం చెబుతున్నా ఉల్లఘించి ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రానికి అప్పగించడం వెనుక చంద్రబాబు అవినీతిలో బీజేపీ భాగం పంచుకునేందుకేనని ఆరోపించారు. సకాలంలో రైతులకు అందించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమాను అందించకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఆదిరాజు, యువజన విభాగం అధ్యక్షుడు సుంకరి సతీష్, బుంగా భానుమూర్తి, డోల శ్రీనివాస్, కరీమ్, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
పోరాటమే కాంగ్రెస్ అజెండా
Published Wed, Jul 19 2017 1:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement