
'కేసీఆర్‌కు హరీష్ కుంపటి పెడతాడు'
టీడీపీ నుంచి ఎవరూ వెళ్లిపోయిన నష్టం లేదని ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు.
హైదరాబాద్: టీడీపీ నుంచి ఎవరు వెళ్లిపోయినా నష్టం లేదని ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఒకరు, ఇద్దరు వెళ్లినంత మాత్రాన కేడర్ పార్టీని వదిలిపోదని అన్నారు. టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, గ్రేటర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన స్పందించారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ కేసీఆర్ తన పార్టీలో చేర్చుకుంటున్నారని, తద్వారా ఆయన పైశాచిక ఆనందం పొందుతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. భవిష్యత్తులో కేసీఆర్‌కు మేనల్లుడు హరీష్‌రావు కుంపటి పెడుతారని జోస్యం చెప్పారు. ఇవాళ మిగతా పార్టీలకు ఉన్న పరిస్థితి రేపు టీఆర్‌ఎస్‌కు తప్పకుండా వస్తుందని అన్నారు.