
సాక్షి, హైదరాబాద్: మెడికల్ సీట్ల కేటాయింపులో బీసీ విద్యార్థులకు అన్యా యం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఓపెన్ కోటాలో సీటు సాధించిన బీసీ విద్యార్థులను రిజర్వ్‌డ్ స్థానాల్లో భర్తీ చేస్తున్నారని, దీంతో బీసీలకు సీట్లు తగ్గుతున్నాయని ఆరోపించారు.
మెడికల్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు సోమవార ఆయన లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఓపెన్ కోటాలో సీటు సాధిస్తే..కాలేజీ మార్పు చేసుకున్నప్పటికీ సదరు విద్యార్థి ఓపెన్ కేటగిరీలోనే ఉండాలన్నా రు. కానీ కేటాయింపులో అలా జరగడం లేదని.. దీనిపై జోక్యం చేసుకోవాలని సీఎంను కోరారు.