BC students
-
Fact Check: గురుకులాలపై ఈనాడు వక్రభాష్యాలు
అదేదో సినిమాలో ... ‘మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నా.. మీరు ఇక్కడే ఉంటారని’..చెప్పే హాస్యనటుడి డైలాగ్ చంద్రబాబు–రామోజీలకు సరిపోతుందేమో...ఎన్నికలేమో దగ్గరపడుతున్నాయి...తన శిష్యుడు చంద్రబాబును ఎంత ఎత్తుదామన్నా...రాజకీయంగా అథఃపాతాళానికి దిగజారిపోయిన ప్రతిష్ఠను తీసుకురాలేని దౌర్భాగ్య స్థితిలో రామోజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై రాళ్లేయాలని చూస్తున్నారు... ఇది ఆకాశమ్మీద రాయివేసిన చందమేనని రామోజీకి అర్థం కావడం లేదేమో... తాజాగా గురుకులాలపై ఈ పచ్చపాత పెద్ద వక్రదృష్టి సారించి, తన విషప(పు)త్రికలో కట్టుకథలు అల్లారు...చంద్రబాబు ప్రభుత్వంలో గురుకులాల సంఖ్య పెరగలేదు..అక్కడి విద్యార్థుల సంక్షేమాన్ని బాబు పట్టించుకోలేదు...విద్యా ప్రమాణాలనూ గాలికొదిలేశారు... ఇప్పుడివన్నీ జగన్ ప్రభుత్వం పట్టించుకుంది..గురుకులాలు పెరిగాయి..డైట్ ఛార్జీలు పెరిగాయి...విద్యా ప్రమాణాలూ పెరిగాయి....ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నీట్, ఇంజనీరింగ్ సీట్లను గురుకుల విద్యార్థులు సాధిస్తున్నారు.. గురుకులాల పేరిట కలకలం రేపాలని రామోజీ తహతహలాడుతూ చదువుల తల్లినీ అవమానిస్తున్నారు... కళ్లు విప్పార్చుకుని చూస్తే ఈ ఎల్లో పెద్దకు నిజానిజాలు తెలుస్తాయి... సాక్షి, అమరావతిః బీసీ విద్యార్థులు చదివే గురుకుల విద్యాలయాలపైనా రామోజీ గురివింద రాతలు మానలేదు. తెలంగాణాతో పోలిక పెట్టి ఆంధ్రప్రదేశ్‌పై బురద చల్లేందుకు ఈయన తాపత్రయ పడ్డారు. పేద పిల్లలకు పెద్ద చదువులు దక్కాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిని వెక్కిరిస్తూ వెకిలి రాతలు రాసేశారు. బీసీ గురుకులాల మంజూరు, నిర్మాణం, విద్యార్థులకు వసతులు, మెరుగైన ఫలితాలు తదితర అనేక విషయాల్లో చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చడమే కాకుండా సీఎం వైఎస్ జగన్ హయాంలో విజయాలను మరుగుపరిచే కుటిలయత్నం ఈ రాతల్లో స్పష్టంగా కన్పించింది. ఈనాడు అబద్ధాలను దునుమాడే వాస్తవాలు ఇవిగో.. ఆరోపణః వైకాపా పాలనలో గురుకులాలకు అథమ స్థానం వాస్తవంః రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన బీసీ గురుకుల విద్యాలయాలకు సీఎం వైఎస్ జగన్ మహర్దశ తీసుకొచ్చారు. చంద్రబాబు హయాంలో కేవలం 41 గురుకులాలు ఉంటే.. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన అనంతరం వాటిని 105కు పెంచారు. విద్యార్థుల సంఖ్యా గణనీయంగా పెరగడంతో పాటు వారికి అవసరమైన నాణ్యమైన విద్య, మౌలిక వసతులు అందించడంలో జగన్ ప్రత్యేక శ్రద్ధతో అనేక చర్యలు చేపట్టారు. ♦ చంద్రబాబు హయాంలో 2018–19 నాటికి రాష్ట్రంలో బీసీ గురుకులాలు కేవలం 41 మాత్రమే ఉన్నాయి. ♦ 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు హడావుడిగా 65 కొత్త గురుకులాలు మంజూరు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. వాటిని కనీసం గ్రౌండింగ్ అయినా చేయలేదంటే చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న 2019 ఏప్రిల్‌లో హడావుడిగా 21 గురుకులాలు ప్రారంభించినట్టు బిల్డప్ ఇచ్చి జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. ♦ సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన అనంతరం 2019 నుంచి 2023లోపు 41 కొత్త గురుకులాలను ప్రారంభించారు. 2023లో మరో రెండు కొత్త గురుకులాలను సీఎం జగన్ ప్రారంభించారు. దీంతో చంద్రబాబు హయాంలో 41 గురుకులాలు ఉంటే, జగన్ ప్రభుత్వ హయాంలో వాటి సంఖ్య 105కు పెరిగిన విషయాన్ని ఈనాడు దాచిపెట్టింది. ఈ గురుకుల విద్యాలయాల్లో 2018–19 విద్యా సంవత్సరం (చంద్రబాబు పాలన)లో 25,629 మంది విద్యార్థులుంటే.. 2023–24 విద్యా సంవత్సరానికి (జగన్ సర్కారు)లో 38,188 మంది విద్యార్థులు పెరగడం గమనార్హం. ♦ రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో 14 జూనియర్ గురుకుల కాలేజీలు ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా మరో నాలుగు మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, నంద్యాల జిల్లా డోన్, బేతంచెర్ల, చిత్తూరు జిల్లా సదుంలో కొత్తగా జూనియర్ గురుకుల కాలేజీలు ప్రారంభించింది. ♦ హెయిర్ కటింగ్ కోసం 3వ తరగతి నుంచి బాలురకు నెలకు గత ప్రభుత్వం రూ.30 ఇస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.50కి పెంచింది. ఆరోపణః బిల్లులు చెల్లించలేదు... వాస్తవంః బడ్జెట్ కేటాయింపుల్లోను జగన్ సర్కారు ఉదారంగా నిలిచిందనే విషయం గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. చంద్రబాబు అధికారం చేపట్టిన తొలినాళ్లలో కేవలం రూ.45 కోట్లు కేటాయిస్తే.. సీఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి రూ.213 కోట్లకు పైగా ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఈ నిజాలనూ రామోజీ దాచేశారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు వాస్తవాలను వక్రీకరించి బోగస్ రాతలు రాస్తున్నారు. ఆరోపణః ‘అద్దె’సరు భవనాలు.. వాస్తవంః పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఇంగ్లీష్ మీడియం చదువులు, ప్రభుత్వ బడుల సౌకర్యాలను మెరుగు పర్చడంలో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందనే విషయం రామోజీకి మింగుడు పడటంలేదు. ప్రభుత్వ బడులు మాదిరిగానే బీసీ గురుకులాల రూపురేఖలను నాడు–నేడు కార్యక్రమంతో మార్చిన విషయాన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగా మరుగున పరిచింది. తొమ్మిది ప్రధానమైన మౌలిక వసతులు కల్పిస్తూ బీసీ గురుకులాలను తీర్చిదిద్దింది. రాష్ట్రంలో 37 గురుకులాలను రూ.17.97 కోట్లతో అభివృద్ధి చేసింది. వాటికి నీటి సరఫరాతో కూడిన టాయిలెట్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, పాఠశాలకు పెయింటింగ్, మరమ్మతులు, ఆకుపచ్చ సుద్ద బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, ప్రహరీ గోడలు నిర్మించింది. జూనియర్ కాలేజీ భవనాల నిర్మాణం విషయానికి వస్తే.. గత ప్రభుత్వం (2014–19)లో రూ.102.60 కోట్లు కేటాయిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం (2019–23)లో రూ.194 కోట్లు కేటాయించింది. ఫలితాలే గీటురాయి.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమేరకు ఫలప్రదమయ్యాయో తెలియాలంటే ఆయా విద్యా సంస్థల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలే గీటురాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీ గురుకుల విద్యార్థులకు ప్రత్యేకంగా ఐఐటీ, నీట్లో ప్రత్యేక కోచింగ్ ఇవ్వడంతో వారు ఉత్తమ ఫలితాలు సాధించారు. ♦ బిసీ గురుకులాల్లో 2022–23లో పదో తరగతిలో 90 శాతం, ఇంటర్మీడియట్లో 90.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. ♦ ఎంపీసీ (ఐఐటీ అడ్వాన్డ్స్)లో 2019–20లో 102 మంది విద్యార్థుల్లో 37 మంది అర్హత సాధించారు. 2020–21లో 205 మందికి 65 మంది అర్హత సాధించారు. 2021–22లో 147 మందికి 45 మంది అర్హత సాధించారు. ♦ఐఐటీ, నీట్, పోటీ పరీక్షల్లో 2022–23లో మంచి ప్రతిభ కనబరిచిన 40 మంది గురుకుల విద్యార్థులు సీట్లు సాధించారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలో ఆరుగురు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 24, నీట్ (బైపీసీ స్ట్రీమ్)లో ఎంబీబీఎస్‌లో నాలుగు, డెంటల్‌లో ఒక సీటు, వెటర్నరీ 4, అగ్రికల్చర్ లో ఒక సీటును సాధించారు. ఆరోపణః బీసీ విద్యార్థుల వెన్ను విరిచారు. వాస్తవంః పేద పిల్లలు చదివే గురుకులాల్లో చంద్రబాబు ప్రభుత్వం కనీసం డైట్, కాస్మొటిక్, హెయిర్ కట్ వంటి ఛార్జీల పెంపుదల మాటే పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని పెంచి అందిస్తున్నారు. ఈ వివరాలు గమనిస్తే ఈనాడు రాసినవన్నీ కట్టుకథలని ఇట్టే తేటతెల్లమవుతాయి. -
పైసా ఇవ్వలే...
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ ప్రముఖ కాలేజీలో డి.సాయికిరణ్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఎంసెట్‌లో ఉత్తమర్యాంకు సాధించి కన్వినర్ కోటాలో సీటు దక్కించుకున్న సాయికిరణ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హుడు. కానీ రెండేళ్లుగా వ్యక్తిగతంగా ఫీజు చెల్లిస్తున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ నిధులు జమ కాగానే చెక్కు రూపంలో ఫీజు వెనక్కి ఇస్తామని కాలేజీ యాజమాన్యం చెప్పడంతో ధైర్యం చేశాడు. సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయడం లేదు. కోవిడ్ తర్వాత నిధుల విడుదలలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దాని ప్రభావం విద్యార్థుల చదువులు, ఇతర అంశాలపై పడుతోంది. బకాయిలు రూ.4,043.19 కోట్లు మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయి. రూ.4043.19 కోట్ల మేర విద్యార్థులకు ఫీజులు, ఉపకార వేతనాలు రూపంలో చెల్లించాల్సి ఉన్నట్టు సంక్షేమ శాఖల గణాంకాలు చెబుతున్నాయి. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల్లో పైసా విడుదల కాకపోగా, అంతకుముందు ఏడాది 40శాతం మాత్రమే నిధులు విడుదలయ్యాయి. సాధారణంగా అయితే విద్యాసంవత్సరం ముగిసిన వెంటనే నిధులు విడుదల చేస్తారు. కానీ మూడేళ్లుగా పరిస్థితి తారుమారైంది. బీసీ విద్యార్థులవే అధికం ఫీజు బకాయిల్లో అత్యధికం బీసీ సంక్షేమశాఖకు చెందినవే ఉన్నాయి. ఈ మూడేళ్లకు సంబంధించి బీసీ విద్యార్థులకు రూ.2182.89 కోట్ల బకాయి లున్నాయి. ఈబీసీ కేటగిరీలో మూడేళ్ల బకాయిలు రూ.661.84 కోట్లు ఉన్నాయి. ♦ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు ప్రత్యేక అభివృద్ధి నిధి ద్వారా నిధుల సర్దుబాటు చేస్తున్నారు. ♦ మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోనూ బకాయిలు 461.05కోట్లు ఉన్నాయి. టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు... ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిధులు విడుదల చేసిన తర్వాత వాటిని కాలేజీ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయడంలోనూ తాత్సారం చేస్తోంది. గతేడాది డిసెంబర్లో దాదాపు రూ.4వందల కోట్లకు సంబంధించి టోకెన్లు జనరేట్ చేసిన అధికారులు ట్రెజరీల్లో క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపారు. – గౌరి సతీశ్, కన్వినర్, కేజీ టు పీజీ ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ దగ్గరున్న ఓఇంజనీరింగ్ కాలేజీలో జె.కార్తిక్ తాజాగా ఎంటెక్ పూర్తి చేశాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంటర్వ్యూ ద్వారా జాబ్‌కు ఎంపికయ్యాడు. ఒప్పందపత్రంపై సంతకంతోపాటు విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికెట్టు సమర్పించాలని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజు చెల్లించాలంటూ రీయింబర్స్‌మెంట్‌కు మెలిక పెట్టింది. దీంతో అప్పు చేసి ఫీజు చెల్లించి కాలేజీకి నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నాడు. -
విద్య, సామాజిక న్యాయానికే పోరు యాత్ర
మన్సూరాబాద్: చదువు, సామాజిక న్యాయ సాధన కోసం బీసీ విద్యార్థి, యువజనుల పోరుయాత్రను నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. పాలమూరు నుంచి పట్నం వరకు చేపడుతున్న పోరుయాత్రను శుక్రవారం ఎల్బీనగర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావుపూలే, కాసోజు శ్రీకాంతాచారి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మళ్లీ రోడ్డు ఎక్కి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువులకు తెలంగాణ సర్కార్ భరోసా కల్పించడంలో విఫలమైందని, బీసీ విద్యార్థులపై కక్షగట్టి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు ఇతర వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ చేసి, బీసీ విద్యార్థులకు మూడేళ్లయినా విడుదల చేయటం లేదని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫీజులను పెంచిందని, కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచకుండా బీసీ విద్యార్థులపై భారం వేసిందని విమర్శించారు. అన్ని జిల్లాల్లో జనవరి 8 వరకు యాత్ర సాగుతుందని జాజుల పేర్కొన్నారు. -
బీసీ విద్యార్థులకు సర్కారు బొనాంజ
వెనుకబడిన తరగతుల వారికి విదేశీ విద్య కింద అందజేసే ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఈ ఉత్తర్వులతో ఎంతోమందికి బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఇది అమలుకానుంది. విదేశాల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసి ఇటీవల ఎంపికైన వారికి ఈ మొత్తం అందనుంది. ఆర్థిక సాయం పెంపుతో బీసీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. –సాక్షి, అమరావతి ఎంపిక విధానం - ఏపీ ఈపాస్‌లో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దరఖాస్తు చేసుకోవాలి. - 33 శాతం మహిళలకు రిజర్వు చేస్తారు. - వారు లేని పక్షంలో పురుషులకు అవకాశం కల్పిస్తారు. - బీసీల్లో ఏ, బీ, డీ గ్రూపుల వారికి నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది. ఆర్థిక సాయానికి నిబంధనలివీ.. - పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేందుకు వీలుగా ఏటా వెయ్యి మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు.. - అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం ఆరు లక్షలలోపు ఉండాలి. ఉద్యోగుల పిల్లలు కూడా ఈ పథకానికి అర్హులు. అయితే, వారి సంవత్సర ఆదాయం కూడా ఆరు లక్షలకు మించకూడదు. - దరఖాస్తు చేసిన సంవత్సరం జూలై ఒకటి నాటికి అభ్యర్థి వయస్సు 35 ఏళ్లకు మించరాదు. ఏఏ దేశాల్లో చదువుకోవచ్చు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, డెన్మార్క్, రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనా (ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనా దేశాల్లో కేవలం మెడిసిన్ చదువుకునేందుకు మాత్రమే అనుమతి). సెలక్షన్ కమిటీలో ఎవరెవరు కమిటీ చైర్మన్‌గా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉంటారు. సభ్యులుగా ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి, జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉంటారు. స్కాలర్షిప్ ఇచ్చే విధానం - విద్యార్థి ల్యాండింగ్ పర్మిట్ చూపించగానే రూ.5లక్షలు మొదటి దఫాగా ఇస్తారు. - సెప్టెంబర్ రిజల్ట్ రాగానే రెండో దఫా రూ.5లక్షలు ఇస్తారు. - చదువుకున్న విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఇలా.. - రూ.10 లక్షలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇచ్చేవారు. - ప్రపంచంలోని 15 యూనివర్సిటీలు, కాలేజీల్లో మాత్రమే చదువుకునేందుకు అనుమతి ఇప్పుడు ఇలా.. - రూ.15 లక్షలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇస్తారు. - రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో ఎక్కడైనా చదువుకోవచ్చు. - సీటు రాగానే అంబేడ్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు అర్హులు. మెరిట్ విద్యార్థులకు సువర్ణావకాశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు దోహదపడుతుంది. తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి రూ.15లక్షల రూపాయలు అంబేడ్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకంలో ఆర్థిక సాయం అందిస్తాం. విదేశాల్లో అత్యున్నత వర్సిటీల్లో బీసీ విద్యార్థులకు విద్యను అందించాలని సర్కారు భావించడం గొప్ప నిర్ణయం. మెరిట్ విద్యార్థులకు ఇదొక మంచి సువర్ణావకాశం. – బి. రామారావు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ -
బీసీ విద్యార్థులకు దీపావళి కానుక
సాక్షి, హైదరాబాద్: బీసీ విద్యార్థులకు ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతన, ఫీజురీయిం బర్స్మెంట్ బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేసింది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో నిర్దేశించిన బడ్జెట్‌కు అనుగుణంగా రూ.1,196.58 కోట్లకు సంబంధించిన బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్లను విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పార్థ సారథి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు వెలువడడమే తరు వాయి బీసీ సంక్షేమ శాఖ తక్షణ చర్యలు చేపట్టింది. ఈ నిధు లతో 2017–18, 2018–19 బకాయి లను దాదాపు క్లియర్ చేయనుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ లకు ప్రత్యేక అభివృద్ధి నిధి కింద నిధుల కేటాయింపులు ఉండ డంతో విద్యా ర్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయిం బర్స్మెంట్ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖకు నిధుల కేటాయింపుల్లో జాప్యం జరుగుతుండడంతో పంపిణీ ఆలస్య మైంది. తాజాగా ఆమోదించిన పద్దుల్లో బీసీ, ఈబీసీ విద్యార్థుల ఉపకార వేత నాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకా లతోపాటు బీసీల కులాంతర వివాహ ఆర్థిక సాయం తదితరాలున్నాయి. ఇందులో ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కేటగిరీల్లో నిధులు విడుదల చేయడంతో ప్రాధాన్యతా క్రమంలో సమాన నిధులు ఇచ్చే వీలుంటుంది. -
రిజర్వేషన్లు పాటించకుంటే యూనివర్సిటీ ముట్టడి: జాజుల
సాక్షి,హైదరాబాద్: మెడికల్ కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు పాటించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మెడికల్ సీట్లు దక్కకుండా చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, వీసీ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించకపోతే ఈనెల 17న కాళోజీ యూనివర్సిటీని ముట్టడిస్తామని జాజుల హెచ్చరించారు. 550 జీవోను అమలు చేయకుండా, యూనివర్సిటీ అధికారులకు వక్ర భాష్యం చెబుతూ ఉన్నతాధికారులను, సంబంధిత మంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. జరిగిన రెండో కౌన్సెలింగ్‌ను రద్దు చేసి, మూడో కౌన్సెలింగ్‌లో రిజర్వేషన్లు పూర్తిగా అమలయ్యేలా చూడాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. -
మూడో కౌన్సెలింగ్‌కు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్లకు 2 విడతల కౌన్సెలింగ్‌ల్లో కొందరికి అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదు రావడంతో మూడో విడతను ప్రభుత్వం వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు దాదాపు 30–40 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 550 జీవో సక్రమంగా అమలు కాలేదని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి వ్యక్తులు భావిస్తు న్నారు. ఒకవేళ రెండు విడతల కౌన్సెలింగ్‌ల్లో పొరపాట్లు జరిగి ఎస్సీ, ఎస్టీ, బీసీల సీట్లు అగ్రవర్ణాలకు వెళ్లినట్లయితే దాన్ని ఎలా సరిదిద్దాలన్న దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అక్రమంగా సీటు పొందారని భావించినా, ఇప్పటికే విద్యార్థులు ఆయా సీట్లల్లో చేరి ఉన్నట్లయితే ఆ సీటును రద్దు చేసే అవకాశమే ఉండదు. పోనీ తదుపరి మూడో విడత కౌన్సెలింగ్‌లో అన్యాయం జరిగిందని భావి స్తున్న 30–40 సీట్లను ఓసీ కేటగిరీలో కోత విధించడమూ సాధ్యంకాదు. కాబట్టి ఎలా దిద్దుబాటు, సర్దుబాటు చేస్తారన్న దానిపై అస్పష్టత నెలకొంది. అసలు 550 జీవో అమలు కాలేదన్న దానిపైనా ఇంకా స్పష్టమైన వైఖరిని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ప్రకటించలేదు. ఈ అంశం వివాదం కావడంతో ఏం చేయాలన్న దానిపైనా, ప్రత్యామ్నాయ చర్యలపైనా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సోమవారం సమావేశమయ్యారు. విచిత్రమేంటంటే వైద్య ఆరోగ్యశాఖ జరిపిన ఉన్నతస్థాయి సమావేశానికి కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను కానీ, రిజిస్ట్రార్‌ను కానీ ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్కడే సమస్య ఉందని భావించినప్పుడు వారిని ఎందుకు పిలవలేదన్న చర్చ సాగుతోంది. కౌన్సెలింగ్‌పై అస్పష్టత... విద్యార్థుల్లో ఆందోళన మూడో విడత కన్వీనర్ సీట్ల కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం బ్రేక్ వేసినా, తదుపరి ఎప్పుడు నిర్వహించేదీ స్పష్టత ఇవ్వలేదు. ఎలా చేస్తారోననేది కూడా వెల్లడించలేదు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొదటి ఏడాది తరగతులు ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో మూడో విడత కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుందోనన్న ఆందోళన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేధిస్తోంది. రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం కన్వీనర్ కోటాలో దాదాపు 160 ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోయాయి. వాటితోపాటు జాతీయ కోటాలో మిగిలిపోయి రాష్ట్రానికి వచ్చిన 67 సీట్లు, అగ్రవర్ణ పేదల (ఈడబ్లు్యఎస్)కు కేటాయించిన 190 సీట్లకు ఇప్పు డు మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అయితే రిజర్వేషన్లలో ఎటువంటి పొరపాట్లు జరగలేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు భావిస్తున్నాయి. అన్నీ సక్రమంగానే నిర్వహించామని చెబుతున్నాయి. కానీ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు మాత్రం ఈ వాదనను ఏకీభవించడంలేదు. సర్కారు పరిధిలోని ఒకే శాఖలో రెండు రకాల వాదనలు వినిపిస్తుండటంతో ఏది వాస్తవమో ఏది అవాస్తవమోనన్న చర్చ జరుగుతోంది. -
ఎవరు.. ఇంకెవరు?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన తరగతులకు చేయూతనందించి అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అడుగడుగునా అవమానిస్తూ అణగదొక్కుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు మాయ మాటలతో మభ్యపుచ్చి ఇప్పుడు ఎన్నికలు ముంచుకు రావడంతో బీసీలే తమ దేవుళ్లంటూ కొంగ జపం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావ సమయంలో బీసీలకు ఎన్టీఆర్ రాజకీయంగా ప్రాధాన్యం కల్పించినా దొడ్డిదారిన టీడీపీని హస్తగతం చేసుకున్న చంద్రబాబు మాత్రం వారిని ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారనేది పరిశీలకుల నిశ్చితాభిప్రాయం. చంద్రబాబు గత తొమ్మిదిన్నరేళ్ల పాలనను చూసినా, ఇప్పుడు అధికారంలో ఉండగా జరుగుతున్న పరిణామాలను గమనించినా బీసీలను ఆయన నయవంచనకు గురి చేశారనేది స్పష్టమవుతుంది. 1 హైకోర్టు జడ్జిలుగా పనిచేసేందుకు బీసీలు పనికిరారంటూ ఒక ముఖ్యమంత్రి కొలీజియానికి లేఖ రాశారని జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ ఆరోపించారు.. ఆ ముఖ్యమంత్రి ఎవరు? 2 తన సమకాలికుడైన ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రిగా వ్యవహరిస్తున్న సీనియర్ బీసీ నేతను సంబంధిత శాఖ వ్యవహారాల్లో పూర్తిగా దూరం పెట్టిన సీఎం ఎవరు? 3 దేవదాయ శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న బీసీ వర్గానికి చెందిన మంత్రిని అమరావతిలో వెంకన్న ఆలయం శంకుస్థాపనకు పిలవవద్దని చెప్పిన సీఎం ఎవరు? 4 తనకు మెమోరాండం ఇవ్వడానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను వేలెత్తి చూపించి బెదిరిస్తూ సెక్రటేరియట్లో కాలుపెట్టనివ్వబోనంటూ ఆగ్రహోదగ్రుడైన సీఎం ఎవరు? 5 తమను ఎస్సీల్లో చేరుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని విశాఖలో ఆందోళన చేసిన మత్స్యకారులను భయపెడుతూ తమాషాలు చేస్తున్నారా, మీ సంగతి చూస్తా.. అని హెచ్చరించిన సీఎం ఎవరు? 6 చేపల వేటపైనే ఆధారపడి జీవించే మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టింది, గల్లంతైన జాలర్ల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎవరు? 7 అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్‌ను అమలు చేస్తానని చెప్పి ఎగ్గొట్టిన సీఎం ఎవరు? వైఎస్సార్ వెలిగించిన చదువుల దీపం.. కనీస చదువులు కూడా పూర్తి చేయకుండానే డ్రాపౌట్లుగా మిగిలిపోతున్న నిరుపేద బీసీ విద్యార్థులను హైస్కూలు గడప దాటించి వృత్తి విద్యా కళాశాలల్లో చదువుకునే అవకాశం కల్పించిన బ్రహ్మాస్త్రం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్. ఇంట్లో చదువుల దీపం వెలిగితేనే ఆ కుటుంబంలో వెలుగులు వెదజల్లుతాయనేది వాస్తవం. దీన్ని గ్రహించినందువల్లే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తెచ్చారు. పూరి గుడిసెలో తల దాచుకునే పేద కుటుంబం కూడా ఫీజుల పథకం వల్లే తమ బిడ్డలను ఇంజనీర్లు, డాక్టర్లుగా చూడగలిగింది. గ్రామీణ పేద విద్యార్థులకు సైతం ట్రిపుల్ ఐటీల్లో చదివే భాగ్యం దక్కింది. అలాంటి అద్భుత పథకాన్ని సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రీయింబర్స్ బకాయిలు విడుదల చేయకుండా దెబ్బ తీసి నీరుగార్చారు. నీరుగార్చేసిన నిర్వాకం బాబుదే.. పేద వర్గాలకు చెందిన పలువురు ఉన్నత ఉద్యోగాలు, గౌరవనీయమైన వృత్తుల్లో స్థిరపడేలా తీర్చిదిద్దిన ఘనత వైఎస్సార్ తెచ్చిన ఫీజుల పథకానిదే. పేద కుటుంబాల జీవన విధానంలో సానుకూల మార్పులతోపాటు సమాజంలో మన్ననలు పొందే స్థితికి వైఎస్సార్ తీసుకురాగలిగారు. ఈ తరహా ఆలోచనలను సీఎం చంద్రబాబు ఏమాత్రం చేయలేకపోగా నిరుపేద విద్యార్థులకు వరం లాంటి ఫీజుల పథకాన్ని నీరుగార్చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తూ ర్యాంకుల ప్రాతిపదికను తెచ్చి సాంకేతిక, ఉన్నత చదువుల వైపు బీసీ విద్యార్థులు కన్నెత్తి చూడకుండా కట్టడి చేశారని ఆయా సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ‘2014 నుంచి ఇప్పటివరకు ఏటా ఫీజు రీయింబర్స్ బకాయిలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. పూర్తి ఫీజులు చెల్లించనిదే సర్టిఫికెట్లు ఇచ్చేది లేదంటూ కళాశాలలు యాజమాన్యాలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నాయి. ఫలితంగా వేలాది మంది బీసీ, ఇతర పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సుల్లో చేరలేకపోతున్నారు. హాస్టల్ మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లను పెంచాలని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నా నాలుగున్నరేళ్లుగా ఆలకించలేదు’ అని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకుడు లెనిన్, ఎస్ఎఫ్ఐ నాయకుడు రాము పేర్కొన్నారు. బకాయిలు రూ.500 కోట్లు వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజుల పథకాన్ని వంద శాతం అమలు చేయాలని ఆయన మృతి చెందిన తర్వాత ధర్నా చేసిన చంద్రబాబు తాను అధికారంలోకి వచ్చాక మాత్రం నిర్వీర్యం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూ.500 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు నానా కష్టాలు పడుతున్నారు. ఆధార్‌తో సంబంధం లేకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని కోరుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చదువుకునేందుకు వేల మంది విద్యార్థులు అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. గీత కార్మికులకు కల్లే దిక్కంటున్న బాబు: ధర్మాన ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేద కుటుంబాలకు చెందినవారు ఉన్నత ఉద్యోగాల్లో కొనసాగుతుంటే సమాజంలో కచ్చితంగా ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వారి జీవన విధానంలో అన్నివిధాలా మార్పు ఉంటుంది. ఈ తరహా మార్పును ఆశించే వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇళ్ల నిర్మాణం లాంటి పథకాలను తెచ్చారు. చంద్రబాబు తీరు ఇందుకు పూర్తి భిన్నం. తాటి చెట్టు ఎక్కేవాడు తాటిచెట్టు ఎక్కుతూనే ఉండాలి. కల్లు గీతపైనే ఆధారపడి జీవించాలి. పోగులు నేసేవాడు పోగులు నేస్తుండాలి. డోలు, సన్నాయి, క్షురక వృత్తిదారులు ఆ పనులకే పరిమితం కావాలి. ఎదుగుబొదుగూ లేకా మగ్గిపోతుండాలి. ఆదరణ పేరుతో నాసిరకం వస్తువులు విదిలించడం తప్ప బీసీలకు చంద్రబాబు చేసింది ఏముంది?’ అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. గత నాలుగున్నరేళ్లలో టీడీపీ తరపున రాజ్యసభకు పంపిన వారిలో ఎవరెవరు ఉన్నారో, ఇతర పదవుల నియామకాలను పరిశీలిస్తే బీసీల పట్ల చంద్రబాబు డొల్లతనం బట్టబయలవుతుందన్నారు. ఎన్నికల జపమే తప్ప... ఎన్నికల ముంగిట బీసీల జపం చేస్తున్న సీఎం చంద్రబాబు తన పాలనలో వారిని పట్టించుకోకపోగా తీవ్ర అవమానాలకు గురి చేశారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో బీసీలకిచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కదాన్ని పరిపూర్ణంగా అమలు చేయలేదని గుర్తు చేస్తున్నారు. బీసీలను మోసగించేందుకు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు 120కిపైగా హామీలను ప్రకటించి అనంతరం వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారు. చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీ కుటుంబాలకు ఐదేళ్లుగా ఎలాంటి న్యాయం జరగలేదు. మైనింగ్‌పై బీసీలకు హక్కులు కల్పిస్తామని చెప్పి ఇసుక, ఇటుకను కూడా టీడీపీ నేతల చేతుల్లోనే పెట్టారు. కుమ్మరులను కనీసం చెరువుల్లో మట్టిని కూడా తవ్వుకోనివ్వకుండా అమ్ముకొని సొమ్ము చేసుకున్న ఘనత టీడీపీ నేతలకే దక్కింది. బీసీలకు జగన్ హామీతో ఉలిక్కిపడ్డ బాబు బీసీలకిచ్చిన హామీలు అమలు చేయపోగా వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతుండటం గమనార్హం. పాదయాత్రలో పేదల కష్టాలను చూసి చలించిన వైఎస్ జగన్ బీసీ అధ్యయన వేదిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నివేదిక రాగానే బీసీ గర్జన నిర్వహించి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు హడావుడిగా జయహో బీసీ కార్యక్రమానికి తెర తీసినట్లు పేర్కొంటున్నారు. బీసీ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మారుస్తామని, అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించగా... జయహో బీసీ సదస్సులో చంద్రబాబు వాటినే ప్రకటించడంపై బీసీ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది. చట్టసభల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం కోసం వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటుబిల్లు ప్రవేశపెట్టారు. ఈ సమావేశాల్లో అది చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆదరణ–2 పేరుతో ఆర్భాటం.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇన్నేళ్ల పాటు ఆదరణ పథకం గురించి పట్టించుకోకుండా కొద్ది నెలల క్రితమే ఆదరణ–2 పేరుతో రజకులు, నాయీ బ్రాహ్మణులు, ఉప్పర్లు, వడ్డెరలు, కమ్మరులకు కంటితుడుపుగా కొద్ది పనిముట్లు ఇచ్చి వాటినే గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. ఈ పథకానికి 7.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 2 లక్షల మందికే పనిముట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం గమనార్హం. మత్స్యకారుల డీజిల్ సబ్సిడీకి ఎగనామం టీడీపీ సర్కారు మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టింది. వారు వేటాడిన చేపలకు మార్కెటింగ్ సౌకర్యం, కనీసం నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ సదుపాయం కూడా కల్పించలేదు. వేటకు వెళ్లి గల్లంతైన జాలర్ల కుటుంబాలకు ఏళ్లు గడిచినా పరిహారమివ్వలేదు. శ్రీకాకుళం జిల్లాలోనే 80 మందికిపైగా మత్స్యకారులు గల్లంతు కాగా ఇప్పటివరకూ పరిహారం అందలేదు. రాష్ట్రంలో తీరం ప్రాంతం విస్తారంగా ఉన్నా గుజరాత్ తదితర రాష్ట్రాలకు మత్స్యకారులు వలస వెళ్లి చిక్కుకుపోయి పాకిస్థాన్ జైళ్లలో మగ్గాల్సిన దుస్థితిని కల్పించారు. నేతన్నలకు వెయ్యి కోట్ల ప్రత్యేక నిధి ఏది? చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు హామీ అమలుకు నోచుకోలేదు. చేనేత కార్మికుల రుణాలన్నింటినీ మాఫీ చేసి ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పిన బాబు నాలుగున్నరేళ్లలో ఆ ఊసే ఎత్తలేదు. చేనేతలకు ఇస్తున్న సబ్సిడీని రూ.600 నుంచి వెయ్యికి పెంచుతామని చెప్పి పట్టించుకోలేదు. ఆప్కో రిబేటు కింద చేనేతలకు చెల్లించాల్సిన సబ్సిడీ సొమ్మును ఇవ్వకుండా వారిని అప్పుల పాలు చేశారు. బీసీ వర్గాలకు చెందిన 11 ఫెడరేషన్లకు అరకొర నిధులిచ్చి సవాలక్ష ఆంక్షలు పెట్టడంతో రుణాలు అందక అల్లాడే దుస్థితి నెలకొంది. కాపు కార్పొరేషన్ తరహాలో బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా బీసీలకు వ్యక్తిగత రుణాలు సులభంగా మంజూరు చేయాలని కోరుతున్నా ఆలకించడం లేదు. ఈ ఫెడరేషన్లను బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో అనుసంధానం చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆ వర్గం నేతలు వాపోతున్నారు. న్యాయస్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన జడ్జిలు నియమితులు కాకుండా అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు కొలిజీయంకు నివేదిక పంపిన చరిత్ర చంద్రబాబుదని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య వెల్లడించడాన్ని బట్టి బీసీల పట్ల బాబుకు ఏమాత్రం ప్రేమ ఉందో బోధపడుతోంది. కులాలకిచ్చిన హామీలు గాలికి.. రజకులు, గాండ్లను ఎస్సీలుగా మారుస్తామని, సగర్లను బీసీ–డీ నుంచి ఏలోకి, పూసల బీసీ–డి నుంచి ఏలోకి, ఆరెకటికలను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మారుస్తామని, కురుబ–కురువలను బీసీ–డి నుంచి ఎస్టీలుగా మారుస్తామని, గవరలను బీసీ–డి నుంచి బీసీ–ఏగా, పద్మశాలీలను బీసీ–బీ నుంచి బీసీ–ఏలోకి, నాగ వంశస్తులను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి, మజ్జులను బీసీ–డీలోకి, విశాఖ కాపులను తూర్పు కాపులుగా గుర్తిస్తామని పలు కులాలకిచ్చిన హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు. మరోసారి అధికారమిస్తే ఇవన్నీ చేస్తామని కొత్తగా హామీ ఇవ్వడం పట్ల సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు. బీసీలకు కనీస గుర్తింపు లేదు... రాష్ట్రంలో బీసీలు 52 శాతంతో 139 కులాల్లో 2.5 కోట్ల మందికిపైగా ఉన్నప్పటికీ వారికి కనీస ప్రాధాన్యం దక్కడం లేదని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచే వారి నైజాన్ని గుర్తించామన్నారు. చంద్రబాబు చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదనేందుకు ఎంబీసీ కార్పొరేషన్ ఒక ఉదాహరణ అని జోగి రమేష్ పేర్కొన్నారు. 32 కులాలతో ఎంబీసీ కార్పొరేషన్ అని ప్రకటించి ఇంతవరకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. పేదల అవసరాలపై జగన్‌కు స్పష్టమైన అవగాహన.. పేదల విషయంలో ఎంత దయార్ధ్ర హృదయుడిగా వైఎస్ రాజశేఖరరెడ్డి మెలిగారో అంతకన్నా మిన్నగా వైఎస్ జగన్ ఉంటారనేది తమ సంపూర్ణ విశ్వాసమని వైఎస్సార్ సీపీ బీసీ నాయకులు జంగా కృష్ణమూర్తి, కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ‘పేదలు అన్ని విధాలా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వైఎస్సార్ ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు అందరితో నీరాజనాలు అందుకున్నాయి. వాటిని మెరుగ్గా తీర్చిదిద్దడంతోపాటు ప్రజామోద పథకాల రూపకల్పనకు జగన్ శ్రీకారం చుట్టారు. పేదల ప్రతి సమస్యను ఆయన సుదీర్ఘ పాదయాత్రలో గుర్తించారు. వాటన్నింటిపైనా అధ్యయనం చేయాలని కమిటీని నియమించి అన్ని ప్రాంతాలకు పంపారు. నివేదిక రూపొందించి సమీక్షించారు. పేదల అవసరాలపై ఆయన స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ప్రజాశీర్వాదంతో అధికారంలోకి రాగానే వాటిని చిత్తశుద్ధితో అమలు చేస్తారు. తండ్రికి మించిన తనయుడని ప్రజల చేత జగన్ అనిపించుకుంటారు’ అని వారు చెప్పారు. మిగిలిన మంత్రులూ ఉత్సవ విగ్రహాలే మంత్రివర్గం, పార్టీలో కీలక స్థానంలో ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి కూడాచంద్రబాబు చేతిలో అవమానాలు తప్పలేదు. సొంత జిల్లాలో యనమల మాట చెల్లుబాటు కాకుండా చేశారు. అన్నవరం దేవస్థానం ఈఓగా యనమల తాను చెప్పిన వారిని నియమించుకోలేని పరిస్థితి ఉందంటే ఆయనకు ప్రభుత్వంలో ఎంతటి ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న కళా వెంకట్రావు సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. మరో బీసీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నా అధికారాలన్నీ చంద్రబాబు, ఆయన తనయుడి చేతుల్లోనే ఉన్నాయి. బీసీ మంత్రి పితాని సత్యనారాయణ తన సొంత జిల్లాలోనే పని చేయించుకునే పరిస్థితి లేదు. బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో చాలామందిది ఇదే పరిస్థితి. కృష్ణా జిల్లాలోని 17 మార్కెట్ కమిటీ ఛైర్మన్లలో 14 చోట్ల ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించడాన్ని బట్టి బీసీలకు లెక్కలేనన్ని పదవులిచ్చామని చెప్పుకుంటున్న ప్రకటనలో వాస్తవం ఎంత ఉందో తేటతెల్లమవుతోంది. వైఎస్ హయాంలో బీసీలైన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంకట రమణ, కేపీ సారథి వంటి నేతలు ప్రధాన శాఖలు నిర్వహించి కీలకంగా వ్యవహరించారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్ గాలికి.. తాము అధికారంలోకి వస్తే బీసీల తలరాతలు మార్చేస్తామంటూ 2012లో విడుదల చేసిన బీసీ డిక్లరేషన్‌ను గద్దెనెక్కాక చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. ఈ డిక్లరేషన్‌ను తు.చ. తప్పకుండా అమలు చేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఆ తరువాత ఆ సంగతే గాలికి వదిలేశారు. నాలుగున్నరేళ్లుగా దీన్ని పట్టించుకోకుండా తీరిగ్గా ఇప్పుడు జయహో బీసీ సదస్సులో బీసీ డిక్లరేషన్‌కు చట్టబద్ధత తెస్తామంటూ మరోసారి హామీ గుప్పించడం గమనార్హం. అధికారంలో ఉండగా ఏమాత్రం పట్టించుకోకుండా మరోసారి తమకు అవకాశం కల్పిస్తే అమలు చేస్తామంటూ మాయమాటలు చెప్పడం ఆయనకే చెల్లిందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చంద్రబాబు రూ.పది వేల కోట్లతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ పెడతామని ఘనంగా ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టకపోగా కేటాయింపులను సైతం ఖర్చు చేసిన పాపాన పోలేదు. బీసీ డిక్లరేషన్ ప్రకారం దామాషా పద్ధతిలో బీసీలకు వంద సీట్లు కేటాయిస్తామని చెప్పిన మాటను తుంగలో తొక్కి కనీసం అందులో సగం స్థానాలను కూడా ఇవ్వలేదు. వైఎస్ హయాంలోనే 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం... దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయించడంతోపాటు 2008 ఆగస్టు 29వ తేదీన అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించడం గమనార్హం. బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఉంటే రాజ్యాధికారం వారికి చేరువవుతుందని అప్పట్లోనే చెప్పారు. ఇక రజక, వడ్డెర, వాల్మీకి కులాలను ఎస్టీల జాబితాలో చేర్చాలని జాతీయ ఎస్టీ కమిషన్‌కు నివేదించాలని వైఎస్ మంత్రి వర్గం అప్పట్లోనే నిర్ణయం తీసుకుంది. అయితే ఒక కులాన్ని ఒక వర్గం నుంచి మరో వర్గంలోకి మార్చే అధికారం రాష్ట్రానికి లేనందున కేంద్రం పరిధిలోనే చేయాలని నిర్ణయించారు. ఆరె, ఆరెవాళ్లు, ఆరోళ్లు, బొందిలి, ఆరె మరాఠి, మరాఠ (బ్రాహ్మణేతర), అరకలిస్, సురభి నాటకాళ్లవాళ్లు, నీలి రాజన్నల, రాజన్నలు, బారె, బార్య, మరార్, తంబోలి, మాలి కులాలను బీసీల జాబితాలో చేర్చేందుకు బీసీ కమిషన్ చేసిన సిఫార్సులకు వైఎస్సార్ ప్రభుత్వం అప్పట్లోనే ఆమోదం తెలిపింది. రెవెన్యూ మంత్రికి తెలియకుండా భూ కేటాయింపులు! రాజకీయాల్లో చంద్రబాబు సమకాలీకుడు, పార్టీలో సీనియర్ నేత, బీసీ వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధికారాలకు చంద్రబాబు కోత వేశారు. రెవెన్యూ శాఖలో ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీ అధికారాలను ఆయనకు కాకుండా తన ఆధీనంలోని జీఏడీకి అప్పగించారు. భూముల కేటాయింపులను కూడా ఆ శాఖను పర్యవేక్షించే కేఈతో సంబంధం లేకుండా అప్పగించేస్తున్నారు. రాజధాని అమరావతి కోసం 33 వేల ఎకరాలు తీసుకున్నా కేఈకి తెలియకుండా తనకు సన్నిహితుడైన మంత్రి నారాయణతో ఆ పని చక్కబెట్టుకున్నారు. భూములు కేటాయించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో రెవెన్యూమంత్రికి స్థానం లేకుండా చేసిన ఘనత కూడా చంద్రబాబుదే. -
‘ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో బీసీలకు అన్యాయం’
సాక్షి, విజయవాడ : ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నిర్వహించిన కౌన్సెలింగ్‌లో బీసీలకు అన్యాయం జరిగిందని, వెంటనే రీ కౌన్సెలింగ్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ విషయంపై హెల్త్ యూనివర్సిటీ వీసీకి మెమోరండం ఇచ్చామన్నారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించి రీ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పటి వరకు రీ కౌన్సెలింగ్ నిర్వహించలేదని, జీవో 550ను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని నిలదీశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోందని మండిపడ్డారు. బీసీల హక్కులను టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని, రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదన్నారు. హెల్త్ యూనివర్సిటీ అధికారులు వెంటనే రీ కౌన్సెలింగ్ చేయాలని, లేని పక్షంలో అన్ని మెడికల్ కాలేజీల వద్ద ఆందోళనలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. -
రిజర్వేషన్ల పై సర్కారుకు చిత్తశుద్ధి లేదు
-
మెడికల్ కౌన్సెలింగ్‌ను నిలిపేయాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: మెడికల్ సీట్ల కేటాయింపులో బీసీ విద్యార్థులకు అన్యా యం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఓపెన్ కోటాలో సీటు సాధించిన బీసీ విద్యార్థులను రిజర్వ్డ్ స్థానాల్లో భర్తీ చేస్తున్నారని, దీంతో బీసీలకు సీట్లు తగ్గుతున్నాయని ఆరోపించారు. మెడికల్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు సోమవార ఆయన లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఓపెన్ కోటాలో సీటు సాధిస్తే..కాలేజీ మార్పు చేసుకున్నప్పటికీ సదరు విద్యార్థి ఓపెన్ కేటగిరీలోనే ఉండాలన్నా రు. కానీ కేటాయింపులో అలా జరగడం లేదని.. దీనిపై జోక్యం చేసుకోవాలని సీఎంను కోరారు. -
విద్యార్థుల ఆకలి కేకలు
నెల్లూరు రూరల్: విద్యార్థులకు భోజనం పెట్టకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆ వార్డెన్ మాకొద్దు అంటూ బీసీ కళాశాల బాలుర వసతిగృహ విద్యార్థులు రోడ్డెక్కారు. కొత్తూరు రామకోటయ్య నగర్‌లోని బీసీ కళాశాల బాలుర వసతిగృహ విద్యార్థులకు బుధవారం ఉదయం టిఫిన్ పెట్టలేదు. వార్డెన్ వంట మనిషిని వెనక్కు పంపడంతో అల్పాహారం అందలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక కొండాయపాళెం గేటు సెంటర్లోని జిల్లా బీసీ సంక్షేమాధికారి కార్యాలయం ఎదట ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఈ వార్డన్ మా కొద్దు, వార్డెన్ వెంకట్రావుపై చర్యలు తీసుకో వాలని, పెరిగిన మెస్ చార్జీలకు అనుగుణంగా మె నూ మార్చాలని, సక్రమంగా భోజనం పెట్టాలని, హాస్టల్లో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీబీసీడబ్లూఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి కె.రాజేశ్వరి విద్యార్థులతో చర్చిం చారు. ఈ ఘటనపై 15 రోజుల్లో విచారించి వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతినిధులు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచిందని, పెరిగిన మెస్ చార్జీలకు అనుగుణంగా సవరించిన మెనూ ప్రకారం భోజనం పెట్టమంటే వార్డెన్ విద్యార్థులపై దాడికి దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన విద్యార్థులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మంగళవారం రాత్రి మెనూ ప్రకారం బుధవారం ఉదయం టిఫిన్ రెడీ చేయాలని మెస్ కమిటీ సభ్యులు కోరడంతో నానా దుష్పలాడారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం టిఫిన్ తయారు చేయకుండా వంట మనిషిని వెనక్కు పంపించారన్నారు. కాంగ్రెస్ బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గాలాజు శివాచారి, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గంపాటి పద్మజ విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. విద్యార్థుల న్యాయమైన కోర్కెలను తీర్చాలని అధికారులకు విన్నవించారు. -
విద్యార్థుల ఆగ్రహం బాబు చవిచూడక తప్పదు
విజయవాడ: టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రిజర్వేషన్ విద్యార్థులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే సరిదిద్దకపోతే బీసీ విద్యార్థుల ఆగ్రహం చవిచూడక తప్పదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి హెచ్చరించారు. మంగళవారం విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్ధసారథి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు ప్రవర్తిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల బలహీన వర్గాలకు చెందిన వందలాది విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోయారని వ్యాఖ్యానించారు. బలహీన వర్గాలకు టీడీపీ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని విమర్శించారు. గత సంవత్సరం వరకు కూడా రీజియన్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు నిర్ణయించి ఆయా కేటగిరీ విద్యార్థులకు సీట్లు కేటాయించేవారని తెలిపారు. మనకు ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనే రెండు రీజియన్లు ఉన్నాయని, వాటి పరిధిలో 1500ల మెడికల్ సీట్లు ఉన్నాయని వివరించారు. రిజర్వేషన్ కోటా ప్రకారం బీసీ-డీకి 7 శాతం, బీసీ-సీకి ఒక శాతం సీట్లు రిజర్వు చేయటం జరిగిందని, ఈ లెక్క ప్రకారం రెండు కేటగిరీలలోని బీసీ విద్యార్థులకు 120 సీట్లు రావాలని అన్నారు. కానీ 10 సీట్లు మాత్రమే వచ్చాయని..దీనికి కారణం కాలేజీని యూనిట్‌గా తీసుకోవడమేనని చెప్పారు. ఓపెన్ కేటగిరీలో సీట్లు సంపాదించిన బీసీ విద్యార్థులను కూడా రిజర్వేషన్ కింద పరిగణించడం వల్లే బీసీ విద్యార్థులు నష్టపోయారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులను పురమాయించి తప్పును దిద్దాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
నిర్లక్ష్య వైఖరి వల్ల రిజర్వేషన్ విద్యార్థులు నష్టపోతున్నారు
-
ర్యాంకు ప్రకారమే రీయింబర్స్మెంట్?
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యార్థులకు ఈ ఏడాది కూడా ర్యాంకు ఆధారంగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బీసీలందరికీ పూర్తి ఫీజు ఇవ్వాలని బీసీ సబ్‌కమిటీ సిఫార్సు చేసి ఆరు నెలలైనా ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం ఇందుకు బలాన్నిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజును సర్కారు చెల్లిస్తుండగా.. బీసీల్లో 10 వేలలోపు ర్యాంకు సాధించిన వారికే పూర్తి ఫీజు ఇస్తోంది. అంతకన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి గరిష్టంగా రూ.35 వేలు అందిస్తుండటంతో మిగతా ఫీజును విద్యార్థులు వ్యక్తిగతంగా భరించాల్సి వస్తోంది. దీంతో మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ రాగా.. గతేడాది బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ర్యాంకుతో సంబంధం లేకుండా పూర్తి ఫీజులివ్వాలని తీర్మానించింది. సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఆర్నెల్లు్ల గడిచినా పూర్తి ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అవే నిబంధనలు బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని కేబినెట్ సబ్ కమిటీ గతేడాది డిసెంబర్లో ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం 2017–18 విద్యా సంవత్సరం బకాయిలు చెల్లిస్తున్నారు. ఇందులో 10 వేల ర్యాంకు సీలింగ్‌ను అనుసరిస్తూ.. ఆ లోపు ర్యాంకు ఉన్న విద్యార్థులకే పూర్తి ఫీజు ఇస్తున్నారు. అంతకన్నా ఎక్కువ ర్యాంకున్న వారికి స్లాబుల ప్రకారం చెల్లిస్తున్నారు. మరోవైపు పోస్టుమెట్రిక్ విద్యార్థుల రీయింబర్స్మెంట్ నిబంధనల్లో మార్పుల్లేవని, గత నిబంధనలే కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. బీసీల్లోని హిందువులకే కోత రీయింబర్స్మెంట్ పథకంలో బీసీ విద్యార్థులకు ర్యాంకు నిబంధన అమలు చేస్తున్నా కొన్ని కులాలకే పరిమితమైంది. బీసీ–బీ కేటగిరీలోని దూదేకుల, నూర్‌బాషా, పింజారి, లద్దాఫ్.. బీసీ–సీ కేటగిరీలోని కన్వర్టెడ్ క్రిస్టియన్, మైనారిటీ కులాలు, బీసీ–ఈ కేటగిరీ కులాలకు మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లిస్తోంది. బీసీల్లోని హిందూ కులాలకే ర్యాంకు నిబంధన ఉండటంతో మతాల ఆధారంగా విద్యా పథకాలు వర్తింపజేయడం సరికాదని బీసీ సంక్షేమ, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
అండగా విదేశీ విద్యా నిధి
కాజీపేట: చదువుకోవాలని తపన ఉండి .. మెరిట్ స్టూడెంట్ అయితే చాలు .. నిరుపేదలైన బీసీ విద్యార్థులకు అర్హతను బట్టి విదేశీ విద్యను అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది. అందుకు విదేశీ విద్యా నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎంతో ప్రతిభ ఉన్నా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విదేశాల్లో చదువు అందని ద్రాక్షలాగే మారుతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకానికి శ్రీకారం చుట్టింది. 2016–17 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది. అక్టోబర్ 10న జీఓ నం 23 ద్వారా ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లా నుంచి 11 మంది విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తు చేసుకోగా ముగ్గురు ఎంపికయ్యారు. వారికి ప్రభుత్వం మొదటి విడతగా రూ.10లక్షలు అందజేసింది. రెండో విడతగా మరో రూ.10 లక్షలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అర్హత గల దేశాలు.. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాలు వెళ్లేవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అర్హత పరీక్షలు : ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ, జీఎంఏటీ అభ్యర్థులు గుర్తింపు పొందిన విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది ఉండాలి. పాస్‌పోర్టు ఉండాలి. ఎంపికైన యూనివర్సిటీలో ఒక సంవత్సరంలోగా చేరాలి. లేకపోతే అడ్మిషన్‌ను నిలిపివేస్తారు. అభ్యర్థి దరఖాస్తు చేసిన కోర్సు, వీసా వివరాలు మార్చుకోవద్దు. అభ్యర్థులు ఆన్లైన్లో www.telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రుణం అందించే విధానం.. ఎంపికైన అభ్యర్థులకు రూ. 20లక్షలకు గాను రెండు విడతలుగా రూ.10 లక్షలు చెక్కులు అందజేస్తారు. అభ్యర్థులు పది లక్షల ఎడ్యుకేషన్ లోన్ ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి అప్లై చేసుకోవచ్చు. స్కాలర్షిప్ పొందిన విద్యార్థుల యూసీలను సంబంధిత యూనివర్సిటీల నుంచి మాత్రమే సమర్పించాలి. అర్హతలు, వయస్సు .. విద్యార్థి వయస్సు దరఖాస్తు చేసే సమయానికి 30 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. ఈ పథకానికి అర్బన్‌లో 2 లక్షలు, రూరల్‌లో అయితే రూ.1.50 లక్షల ఆదాయ పరిమితి ఉంటుంది. విద్యార్హతలు: ఇంజనీరింగ్ డిగ్రీ, మేనేజ్మెంట్ డిగ్రీ, ప్యూర్ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్ సోషల్ సైన్స్, హ్యుమానిటీ మొదలైన డిగ్రీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఒక్కో కుటుంబంలో ఒక్కరు మాత్రమే అర్హులు. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి.. బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–డీ వారు బీసీ సంక్షేమశాఖలో దరఖాస్తు చేసుకోవాలి. బీసీ–సీ వారు ఎస్సీ సంక్షేమశాఖలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బీసీ–ఈ వారు మైనార్టీ సంక్షేమశాఖలో దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్లు.. బీసీ–ఏ వారికి 29 శాతం, బీసీ–బీ వారికి 42 శాతం, బీసీ–డీ వారికి 29 శాతం, మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు మూడు శాతం చొప్పున రిజర్వేషన్ ఉంటుంది. -
పూర్తి ‘ఫీజు’ ఇవ్వాల్సిందే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని బీసీ విద్యార్థి మహాగర్జన తీర్మానించింది. బీసీ క్రీమీలేయర్ నిబంధనను ఎత్తివేయాలని, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేసింది. రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని.. చట్టసభల్లోనూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరింది. బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, ప్రైవేటు రంగాల్లో సమాన వాటా హక్కుగా కల్పించాలని డిమాండ్ చేసింది. శనివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో బీసీ విద్యార్థి మహా గర్జన సభ జరిగింది. ఇందులో మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్యగౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఈటల, జోగు రామన్న తదితరులు మాట్లాడారు. అనంతరం బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ తీర్మానాలు చేశారు. బీసీల సంక్షేమం కోసం కృషి: ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వం మూడున్నరేళ్ల పసిపాప అని.. అయినా సంక్షేమ పథకాల అమల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. గురుకులాల ద్వారా నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్నామని, బీసీల కోసం ఈ ఏడాది కొత్తగా 119 గురుకులాలు ప్రారంభించామని తెలిపారు. పేద విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. పేద విద్యార్థుల విదేశీ చదువుల కోసం రూ.20 లక్షల ఆర్థిక సాయం, ఆడపిల్లల వివాహం కోసం రూ.75 వేల ఆర్థిక సాయం అందచేస్తున్నామని తెలిపారు. తమది చేతల ప్రభుత్వమని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ప్రకటించారు. పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశంసించాలని, సమస్యలుంటే ఐక్యంగా పోరాడాలని సూచించారు. బీసీ ప్రజాప్రతినిధులు వారి వర్గాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని సూచించారు. ప్రస్తుతం చదువుకున్న వారికి ఉద్యోగాలు, ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం చేసిన తీర్మానాలపై ప్రభుత్వం చర్చించి జీవో ఇస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఈటల గుర్తు చేశారు. బీసీలకు 50శాతం రిజర్వేషన్ల కోసం ప్రధానిని కలుస్తామని చెప్పారు. ఆర్థికంగా బలోపేతం కావాలి: జోగు రామన్న బీసీలందరూ దారిద్య్రరేఖకు దగ్గర ఉన్నవారేనని, వారు ఆర్థికంగా బలోపేతమైతేనే రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. విద్యార్థులు గతంలో మెస్‌చార్జీల కోసం ధర్నాలు చేసేవారని, ఇప్పుడా పరిస్థితులు లేవని చెప్పారు. సీఎం కేసీఆర్ అందరి సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారన్నారు. బీసీ విద్యార్థులకు కూడా ర్యాంకులతో సంబంధం లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. బీసీలకు రెసిడెన్షియల్ విద్యాసంస్థలతోపాటు ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఎన్టీఆర్ బీసీలకు స్థానిక సంస్థల్లో 33శాతం ఇస్తే.. కేసీఆర్ ప్రభుత్వం 50 శాతం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. జనాభాలో 54 శాతం ఉన్న బీసీలు ఐక్యంగా ఉండి.. పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా పోరాడాలి: దత్తాత్రేయ పార్టీలకు అతీతంగా పోరాడితేనే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. విద్యార్థుల జీవితాలు విద్య, ఉద్యోగాలతో ముడిపడి ఉన్నాయని, బీసీల కోసం సబ్‌ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు నాయకులు పార్టీలకు అతీతంగా ఒకే వేదిక మీదికి రావడం అభినందనీయమన్నారు. బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలి: లక్ష్మణ్ తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు 19 మంది బీసీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం శోచనీయమని కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీసీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని... బ్రహ్మాస్త్రమైన ఓటు హక్కును ఉపయోగించుకుని బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సంఘటితంగా లేకపోవడమే సమస్య: జస్టిస్ ఈశ్వరయ్య బీసీలంతా సంఘటితంగా లేకపోవటం వల్లే వెనుకబడి ఉన్నారని జస్టిస్ వంగాల ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. విద్యార్థుల పాత్ర కీలకమని, రాజకీయ పెద్దలు వారిని చైతన్యవంతం చేసి సామాజిక తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. సమస్యలపై ఉద్యమించండి: నటుడు సుమన్ బీసీలు తమ సమస్యలపై ఉద్యమించాలని, అవసరమైతే సినీ రంగాన్ని వదులుకుని తాను బీసీలకు మద్దతు పలుకుతానని సినీ నటుడు సుమన్ చెప్పారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు పార్లమెంటులోని ప్రతి బీసీ ఎంపీ కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని, కలిసికట్టుగా కోరితే బీసీలకు కూడా పదవి వస్తుందని చెప్పారు. అధికారం సాధించాలి.. తపన, పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని.. తెలంగాణలో బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలు శ్రమించాల్సి ఉంటుందని ఎల్.రమణ పేర్కొన్నారు. బీసీ విద్యార్థులు పల్లెబాట పట్టి 2019 ఎన్నికల్లో 60 సీట్లు సాధించేందుకు కృషి చేయాలన్నారు. 60 కోట్ల జనాభా ఉన్న బీసీలకు కేంద్ర బడ్జెట్లో రూ.800 కోట్లు మాత్రమే కేటాయించటం దారుణమని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. రాజ్యాధికారమే సమస్య అని, విద్యార్థులు అసెంబ్లీ వైపు చూడాల్సిన అవసరముందని చెప్పారు. సమాజాన్ని చైతన్యపరిచి బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులదేనని పొన్నాల లక్ష్మయ్య సూచించారు. డెబ్బై ఏళ్ల పాలనలో తెలంగాణలో 23 గురుకులాలు ఉంటే.. రాష్ట్రం వచ్చాక ఒకే ఏడాదిలో 119 గురుకులాలు ఏర్పాటయ్యాయని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బీసీ విద్యార్థి గర్జన తీర్మానాలివే.. – ర్యాంకుతో నిమిత్తం లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల తరహాలో బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వాలి. – ప్రైవేట్ రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలి. – కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీని అరికట్టేందుకు నియంత్రణ చట్టం తీసుకురావాలి. – విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేదలకు ఇవ్వాలి. – ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులకు పూర్తిస్థాయి ఫీజులను ప్రభుత్వమే భరించాలి. – ప్రతీ మండలానికి ఒక గురుకుల పాఠశాల, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలి. – ఐఐటీ, ఎన్ఐటీ తదితర ప్రఖ్యాత సంస్థల్లో సీట్లు పొందే రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. – కేంద్రంలో ఖాళీగా ఉన్న 12 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రంలో 1.5 లక్షల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. – బీసీ క్రీమీలేయర్ నిబంధనను ఎత్తివేయాలి. – చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. దీనిపై సీఎం నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. – రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలి. – బీసీ భవన్‌కు హైదరాబాద్‌లో పదెకరాలు, జిల్లాల్లో ఐదెకరాల స్థలాలు కేటాయించాలి. – బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, ప్రైవేటు రంగాల్లో సమాన వాటా కల్పించాలి -
బీసీలు మరో పోరుకు సిద్ధం కావాలి: జాజుల
హైదరాబాద్: బీసీ విద్యార్థులు మరో పోరుకు సిద్ధం కావా లని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో సమాన వాటా, సామాజిక న్యాయం అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 30న నగరంలోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ‘బీసీ విద్యార్థి మహాగర్జన’ నిర్వహిస్తున్నామని చెప్పారు. దోమలగూడలో ఆదివారం విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ అధ్యక్షతన సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. జాజుల మాట్లాడుతూ ప్రైవేట్‌రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలన్నారు. మంద కృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ విద్యార్థి మహాగర్జన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె. శ్రీనివాస్, టి. విక్రమ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్!
సాక్షి, హైదరాబాద్: బీసీ విద్యార్థులకు శుభవార్త. ఇంజనీరింగ్, వృత్తివిద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు సర్కారు ఊరట ఇవ్వబోతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనల్లో మార్పులు చేపట్టనున్నట్లు తెలిసింది. కాలేజీ ఫీజును పూర్తిస్థాయిలో పొందాలంటే సదరు విద్యార్థికి సెట్(కామన్ ఎంట్రన్స్ టెస్ట్)లో పదివేలలోపు ర్యాంకు రావాల్సి ఉంది. పదివేల కంటే పైబడి ర్యాంకు వస్తే కేవలం రూ.35 వేలను మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుండగా, మిగతా మొత్తాన్ని విద్యార్థి భరించాల్సి వచ్చేది. ఈ నిబంధనపై బీసీ, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేందుకే ఈ నిబంధన పెట్టినట్లు అప్పట్లో ప్రభుత్వం చెప్పుకొచ్చింది. బీసీ ‘ఈ’లో ఉన్న మైనార్టీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఫీజులిస్తూ ఏ, బీ, సీ, డీ కేటగిరీల్లోని ఇతర బీసీ విద్యార్థులపై ఆంక్షలు పెట్టడం సమంజసం కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో పూర్తిస్థాయి ఫీజు చెల్లింపునకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని బీసీ సంక్షేమ శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. భారం రూ.310 కోట్లు... ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఈ ఏడాది 13.06 లక్షల దరఖాస్తులు రాగా, అందులో బీసీ విద్యార్థుల దరఖాస్తులు 7.22 లక్షలు. ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించి పదివేల ర్యాంకు దాటిన విద్యార్థులకు ఫీజు కింద రూ.35 వేలను మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు సగటున 45 వేలకుపైగా ఉంది. పదివేల ర్యాంకు నిబంధనను ఎత్తేస్తే గరిష్టంగా రూ.310 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఏటా రూ.2,810 కోట్ల మేర ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నిబంధనలపై సమీక్ష నిర్వహిస్తున్న సర్కారు ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. -
బీసీ విద్యార్థులకు అన్యాయం: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం దాటవేసే దోరణి అవలింబించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో బీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. ఫీజు బకాయిలు పెరిగిపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్లను కాలేజీ యాజమాన్యాలు ఇవ్వడం లేదని అన్నారు. అలాగే కాలేజీ యాజమాన్యాలు కూడా తమ సిబ్బందికి జీతాలను ఇచ్చే పరిస్థితులు లేవని తెలిపారు. తక్షణమే ఫీజు బకాయిలను చెల్లించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
బీసీలకు గొర్రెలు.. మీకు పదవులా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: బీసీలకు గొర్రెలు, బర్రెలు, చేపలు అని మభ్యపెట్టి రాజ్యాధికారం, పదవులన్నీ కేసీఆర్ కుటుంబం అనుభవిస్తుందా అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. బీసీ విద్యార్థులకు చదువును దూరం చేసి, ఓట్ల కోసం తాయిలాలతో కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. అధిష్టాన వర్గం అనుమతిస్తే రాష్ట్రంలో బీసీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు రాష్ట్రంలో పర్యటిస్తానని చెప్పారు. -
కొత్తగా 119 బీసీ గురుకులాలు
నియోజకవర్గానికి ఒకటి చొప్పున వచ్చే ఏడాదే ప్రారంభిస్తాం: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిబాపూలే పేరిట వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా 119 కొత్త బీసీ గురుకులాలను ప్రారంభించనున్నట్టు సీఎం కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న ఈ పాఠశాలల్లో మొత్తం 76,160 మంది విద్యార్థులు మంచి విద్యను పొందు తారని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలపై కేసీఆర్ ప్రకటన చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రమూ బలహీన వర్గాల కోసం ఇంత పెద్ద సంఖ్యలో గురుకుల విద్యాలయాలను నెలకొల్పలేదని, తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం వెనుకబడిన కులాల విద్యార్థుల అభివృద్ధికి పునాది వేస్తుందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఎస్సీలకు 125, ఎస్టీలకు 51 రెసిడెన్షియల్ పాఠశాలలను మంజూరు చేశామని, మైనార్టీలకు 200 స్కూళ్లను మంజూరు చేసి గత ఏడాదే 71 పాఠశాలలు ప్రారంభించామని వివరించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లిష్ మీడియంలో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చేయనున్నట్టు పేర్కొన్నారు. మౌలిక వసతులు, మంచి పోషకాహారం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం తదితరాల కోసం ప్రతి విద్యార్థిపై రూ.1.05 లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. ధనవంతుల పిల్లలు కార్పొరేట్ విద్యా సంస్థల్లో పొందే విద్య కన్నా మెరుగైన విద్యను ఈ స్కూళ్ల ద్వారా బీసీ విద్యార్థులు పొందుతారన్నారు. బీసీలు వికాసం పొందాలన్న ఉద్దేశంతోనే కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని భావించామని, ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే అమలు దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి జరిగినప్పుడే దేశం నిజమైన పురోగతిని సాధిస్తుందన్న పూలే స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం పునరంకితమవుతుందన్నారు. -
బీసీ స్టడీ సర్కిళ్ల కార్యాచరణకు ఆమోదం
రూ. 25.5 కోట్లతో 14 వేల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల(బీసీ) స్టడీ సర్కిళ్లకు సంబంధించి రూ.25.5 కోట్లతో 14 వేల మందికి లబ్ధి చేకూర్చేలా రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ ఏడాది (2016-17) కొత్తగా 500 మందికి జీఆర్ఈ/జీమాట్, టోఫెల్/ఐఎల్ఈటీఎస్లకు శిక్షణ అందించాలనే ప్రతిపాదనను ఆమోదించింది. దీని కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోస్టులు, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణతో పాటు కెరీర్ కౌన్సెలింగ్ తదితరాలను కలుపుకుని మొత్తం 500 మందికి శిక్షణ అందిస్తుంది. జీఆర్ఈ/టోఫెల్ తదితరాలకు సంబంధించి బీసీ విద్యార్థులు కోరుకున్న ప్రైవేట్ శిక్షణా సంస్థల్లో బోధన ఇప్పించేం దుకు నిర్ణయించింది. సివిల్ సర్వీసెస్‌కు సంబంధించి వంద మందికి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పించేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని బీసీ స్టడీ సర్కిళ్ల డెరైక్టర్‌ను ప్రభుత్వం ఆదేశిం చింది. రాష్ట్రంలోని 10 స్టడీ సర్కిళ్లలో నలుగురు డెరైక్టర్లు మాత్రమే రెగ్యులర్ పోస్టులతో పనిచేస్తుండగా, ఖాళీగా ఉన్న మరో 6 జిల్లాల డెరైక్టర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. స్టడీ సర్కిళ్ల మేనేజింగ్ కమిటీని మరింత విస్తరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొత్తగా పరిశ్రమలు, ఉపాధి, గ్రామీణాభి వృద్ధి శాఖల కమిషనర్లను సభ్యులుగా చేర్చుకోవాలని శనివారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక సీఎస్ సోమేశ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సమావేశంలో మేనేజ్మెంట్ కమిటీ కమిషనర్ జీడీ అరుణ, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు, హైదరాబాద్ ఏజేసీ అశోక్‌కుమార్, కన్వీనర్, బీసీ స్టడీ సర్కిళ్ల డెరైక్టర్ చంద్రశేఖర్, ఎస్టీ శాఖ డీడీ నికొలస్, మహిళా, శిశుసంక్షేమ డీడీ లక్ష్మీ, ఎస్సీ శాఖ డీడీ హనుమంతనాయక్ పాల్గొన్నారు. -
ఏడు నెలలుగా ట్యూటర్లకు అందని వేతనాలు
టెన్త్ ఫలితాలపై పడనున్న ప్రభావం సర్కారుకు పట్టని బీసీ విద్యార్థుల వెతలు రూ.32కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాశాల విద్యార్థులు సాక్షి ప్రతినిధి, విజయనగరం : పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులంతా ఏకాగ్రతతో సమాయత్తమవుతున్నారు. వసతి గృహాల్లో మెరుగైన ఫలితాలకోసం అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ట్యూటర్ల చేత పిల్లలకు పదును పెట్టిస్తున్నారు. జిల్లాలోని 45వసతి గృహాల్లో 1151మంది విద్యార్థులకు 168మంది ట్యూటర్లు ప్రత్యేక క్లాసులు చెబుతున్నారు. కానీ వారికివ్వాలని గౌరవ వేతనాన్ని ఏడు నెలలుగా ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇప్పటివరకు రూ. 22.68లక్షల మేర గౌరవ వేతనం రావాల్సి ఉండగా ఇంతవరకు రూ. 3.38లక్షలే విడుదల చేసింది. ఇంకా రూ.19.35లక్షలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. దాదాపు ఏడు నెలల వేతనం ట్యూటర్లకు అందాల్సి ఉంది. అధికారులు ఇదిగో అదిగో అనడమే తప్ప వారికి న్యాయం చేయలేకపోతున్నారు. పరీక్షలు సమీపిస్తున్న సమయంలో కూడా వారికి న్యాయం జరిగేలా కన్పించడం లేదు. దీనివల్ల టూటర్లలో నిరాసక్తత నెలకొంది. బోధనలో వారు చాలావరకూ శ్రద్ధ చూపలేకపోతున్నారు. ఈ ప్రభావం రాబోయే ఫలితాలపై పడుతుందేమోనని అధికారులు కలవరపడుతున్నారు. ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయి రూ.32కోట్లు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ. 88కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు రూ. 56కోట్లు మాత్రమే విడుదల చేసింది. విద్యా సంవత్సరం ముగియవస్తున్నా మిగతా రూ. 32కోట్లు విడుదల కాలేదు. దీనిపై ఆధారపడిన 57,772మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు పూర్తి స్థాయిలో జమ కాకపోవడంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు హాల్ టిక్కెట్లు ఇచ్చేందుకు ఇబ్బంది పెడుతున్నాయి. ఈబీసీ విద్యార్థులూ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. రూ. 15.54కోట్లకు రూ. 9.13కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా రూ. 6.41కోట్లు రావాల్సి ఉంది. 4,257మంది ఈబీసీ విద్యార్థులకు ఫీజు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లైతే మూడేళ్లుగా రావట్లేదు. రూ. 2.45కోట్లకు రూ. 32.44లక్షలే విడుదల చేసింది. అది ఎటూ చాలదన్న ఉద్దేశంతో విడుదలైన నిధులను కూడా చెల్లించలేదు. మరో రూ. 2.13కోట్లు విడుదలైతే తప్ప వీరి సమస్య పరిష్కారం కాదు. అధైర్యపడొద్దు : బీసీ వేల్ఫేర్ ఇన్చార్జి ఆఫీసర్ వసతి గృహాల్లో పనిచేస్తున్న ట్యూటర్లకు గౌరవ వేతనాలు త్వరలోనే విడుదలవుతాయని, ఇటీవల కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు బీసీ వేల్ఫేర్ ఇన్చార్జి ఆఫీసర్ మనోరమ ‘సాక్షి’కి తెలిపారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ ట్యూటర్లు అశ్రద్ధ వహించకూడదని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నిధులు కూడా విడుదలవుతాయని చెప్పారు. -
బడుగు విద్యార్థులంటే అంత అలుసా?
తెలంగాణలో దళితులు, బీసీలు అధికశాతం ఉన్నందున వారి చదువుల కోసం బోధనా రుసుముల పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గతంలో ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో బడుగు బలహీనవర్గాల విద్యార్థుల చదువుల కోసం లక్ష ఆదాయ పరిమితి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు జీవం పోసిన ఆ పథకానికి టీఆర్ఎస్ ప్రభుత్వం గండికొట్టే ప్రయత్నాలు చేస్తోంది. గత మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.3 వేల కోట్లు పెండింగులో ఉన్నా యి. నూతన ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల విషయంలో ఏదో ఒక తిరకాసు పెడుతూ స్థానికత విషయమై హైకోర్టు మందలింపులతో వెనక్కు తగ్గినప్పటికీ, నేటికీ ఈ పథకం అమలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో 2014-15లో ఫీజులు, ఉపకారవేతనాలకు 13,35,402 మం ది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 7,30,469 మంది బీసీలు కాగా, 2,49,202 మంది ఎస్సీలు, 1,34,976 మంది ఎస్టీలు, 1,20,151 మంది మైనార్టీలు, 1,00,297 మంది ఈబీసీలు, సుమారు 307 మంది వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు రూ.2 వేల కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉండగా నేటివరకు ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. బడ్జెట్లో మాత్రం అత్యధిక నిధులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే కేటాయిస్తున్నట్లు అంకెల్లో చూపించారు. కానీ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులు 3 నెలల్లో 25 శాతం, 6 నెలల్లో 25 శాతం, సంవత్సరం ముగిసేనాటికి పూర్తిగా ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్షిప్లు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణలో ఇది అమలు జరగటంలేదు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకుంటే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునయినా సరే బకాయిలు చెల్లించాలని ఉన్నత న్యాయ స్థానం పేర్కొంది. మరోవైపున ఫీజులు చెల్లించనందున ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫి కెట్లు ఇవ్వడానికి ప్రైవేట్ యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. పరీక్ష సం దర్భాల్లో హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నా రు. ఫీజులు వచ్చిన తర్వాత తిరిగి చెల్లిస్తాం, ముందు ఫీజు చెల్లించమని యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. బకాయిలు చెల్లించడానికి నిధులు లేవం టున్న ప్రభుత్వం మరోవైపున పుష్కరాలు, దేవాలయాలు, ఆవిర్భావ దినోత్స వాలు, ఫీజు బకాయిలు చెల్లించడానికి తన దగ్గర డబ్బులు లేవని బీద అరు పులు అరుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు మాని పూర్తి స్థాయిలో రెండేళ్ల బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. నిధులు లేవన్న సాకుతో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు ఎగనామం పెట్టాలని చూస్తే విద్యార్థుల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవిచూడవలసివస్తుంది. - కోట రమేష్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు, హైదరాబాద్, 9618339490.