బీసీ విద్యార్థులకు కామన్ ఫీజు గండం | BC students Common fees danger | Sakshi
Sakshi News home page

బీసీ విద్యార్థులకు కామన్ ఫీజు గండం

Published Tue, Aug 5 2014 3:15 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

బీసీ విద్యార్థులకు కామన్ ఫీజు గండం - Sakshi

బీసీ విద్యార్థులకు కామన్ ఫీజు గండం

ఎచ్చెర్ల క్యాంపస్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అమలుచేస్తున్న నిబంధనలు బీసీ విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. పదివేల ర్యాంకు దాటి న విద్యార్థులు కామన్ ఫీజు స్ట్రక్చర్ దాటిన కళాశాలలో చేరితే అదనపు ఫీజు భరించాల్సి వస్తోంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం కామన్ ఫీజుతో సంబంధంలేకుండా మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఈ ఏడాది కూడా ఇదే నిబంధన అమలుచేస్తారా, మార్పుచేసి న్యాయం చేస్తారా అన్న సందిగ్ధం విద్యార్థుల్లో నెల కొంది.
 
 పస్తుతం జిల్లాలోని కళాశా లల ను ఉదాహరణగా తీసుకుంటే రాష్ట్ర ఫీజుల నియంత్రణ మండలి నిర్ణయించిన ఫీజు రూ .35 వేలు కాగా రాజాం సమీపంలోని జీఎంఆర్ ఐటీలో రూ.80,400, టెక్కలి సమీపంలోని ఐతంలో రూ.68,000 పీజు స్ట్రక్చర్ ఉంది. మిగతా ఆరు కళాశాలల్లో కామన్ ఫీజ్‌కు అటుగా, ఇటుగా ఫీజు ఉంది. 10 వేలు ర్యాంకు దాటిన విద్యార్థులు ఈ కళాశాల్లో చేరితే అదనపు ఫీజు భ రించాల్సి వస్తోంది. దీంతో ఈ ఫీజు చెల్లించే సామర్థ్యం లేని విద్యార్థులు కామన్ ఫీజు కళాశాలలను ఎంపిక చేసుకోవలసి వస్తోంది. ఇతర జిల్లాల్లో రూ.లక్ష దాటి ఫీజు స్ట్రక్చర్ ఉన్న కళాశాలలు కూడా ఉన్నాయి. ఇటు వంటి కళాశాలల్లో విద్యార్థులు చేరితే కామన్ ఫీజు మినహాయించి రూ.65 వేలు విద్యార్థులు బరించ వల్సి ఉంటుంది. కామన్ ఫీజు కంటే ఎక్కువ సొమ్మును విద్యార్థులు ఫీజురూపంలో చెల్లించాల్సి వస్తోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
 
 నష్టపోతున్న జిల్లా విద్యార్థులు
 జిల్లాలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువ. దీంతో పాటు బీసీలు ఎక్కువ. విషయ పరిజ్ఞానం ఉన్నా మొదటి ప్రయత్నంలో పట్టణ ప్రాంతాల విద్యార్థులతో పోటీ పడి ర్యాంకు సాధించడం సాధ్యం కాదు. ఈ నేపధ్యంలో మన జిల్లా విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారు. మరోవైపు 10 వేలు ర్యాంకు లోపు విద్యార్థులు ఎక్కువగా ప్రభుత్వ సంస్థల్లో, యూనివర్సిటీల్లో చేరే వీలుంటుంది. ఈ ఏడాది మన జిల్లా నుంచి 4,850 మంది విద్యార్థులు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షకు హాజరు కాగా, 10 వేలు లోపు ర్యాంకులు సాధించిన వారు 1000 లోపు ఉంటారని అంచనా. 10 నుంచి 20 వేలు మధ్య ర్యాంకు సాధించిన వారు 3 వేలు దాటి ఉంటారు. వీరందరూ ర్యాంక్ సీలింగ్ నిబంధన వల్ల కామన్ ఫీజు స్ట్రక్చర్ దాటి ఉన్న కళాశాలలను మిస్ అవుతున్నారు. ఈ ఏడాది నిబంధనలు సడలించాలని విద్యార్థులు కోరుతున్నారు.
 
 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మెంట్‌పై స్పష్టత కరువు
 ఇప్పటికే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 7 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరగనుంది. తెలంగాణ ప్రభుత్వం రీయింబర్స్ మెంట్‌పై ఎలాంటి స్పష్టత తెలపలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ అమల్లో మార్పులు చేస్తుందా? పాత విధానాన్నే అమలు చేస్తుందా? అన్న సందిగ్ధం నెలకొంది.
 
 విద్యార్థుల ప్రయోజనాలు ముఖ్యం
 ర్యాంక్ సీలింగ్ వల్ల విద్యార్థులకు మంచి కళాశాలలో సీటు లభించే అవకాశం ఉన్నా ఆర్థిక స్థోమత సహకరించక కామన్ ఫీజ్ కళాశాలలు ఎంచుకోవాల్సి వస్తోంది. ర్యాంకులతో ఫీజు రీయింబర్స్‌మెంట ముడిపెట్టటం కంటే సీటు లభించిన కళాశాల బట్టి ఫీజులు చెల్లించే నిబంధన అమలుచేస్తే మంచిది. 10 వేలు ర్యాంకు దాటిన విద్యార్థులకు ప్రతిభ లేనట్లు చెప్పలేం. మెరుగైన కళాశాల్లో చేరితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు సైతం ఉంటుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి.
 -ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు,
 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement