బీసీలు మరో పోరుకు సిద్ధం కావాలి: జాజుల | BC's should prepare for another fight | Sakshi
Sakshi News home page

బీసీలు మరో పోరుకు సిద్ధం కావాలి: జాజుల

Published Mon, Dec 25 2017 2:53 AM | Last Updated on Mon, Dec 25 2017 2:53 AM

BC's should prepare for another fight - Sakshi

హైదరాబాద్‌: బీసీ విద్యార్థులు మరో  పోరుకు సిద్ధం కావా లని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో సమాన వాటా, సామాజిక న్యాయం అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 30న నగరంలోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ‘బీసీ విద్యార్థి మహాగర్జన’ నిర్వహిస్తున్నామని చెప్పారు.

దోమలగూడలో ఆదివారం విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌ అధ్యక్షతన సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. జాజుల మాట్లాడుతూ ప్రైవేట్‌రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలన్నారు.  మంద కృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం బీసీ విద్యార్థి మహాగర్జన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో  సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె. శ్రీనివాస్, టి. విక్రమ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement