‘కేసీఆర్ కుట్ర చేస్తున్నారు’
హైదరాబాద్: టీడీపీని దెబ్బతీసేందుక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుట్ర చేస్తున్నారని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కార్యకర్తల పార్టీ అయిన టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం, ఉగాది పండుగ ఒకేరోజు రావడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు స్పూర్తితోనే తాము ముందుకు సాగుతామని చెప్పారు.
ఈ కార్యకమంలో ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దిరెడ్డి పాల్గొన్నారు. టీడీపీలో పుట్టి పెరిగిన కేసీఆర్.. ఇప్పుడు ఆ పార్టీనే లేకుండా చేయాలని చేస్తున్నారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ధ్వజమెత్తారు. కొందరు నాయకులు పదవుల కోసం స్వార్థంతో పార్టీ మారారని, వారు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ లేదన్నారు.