సమున్నత ఆశయాలతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భ్రష్టుపట్టిపోయిందని టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ప్రస్తుతం టీడీపీ పీకల్లోతు కష్టాల్లో ఉందని, నాయకత్వలోపంతో కొట్టుమిట్టాడుతున్నదని, ఓటుకు కోట్లు కేసు వల్లే ఈ దుస్థితి దాపురించిందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. గత ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించినా, తర్వాతి కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీని వీడినా అడిగే దిక్కులేకుండాపోయిందని, పరిస్థితి మారాలంటే చంద్రబాబు నాయుడే స్వయంగా తెలంగానలో తిరగాలని సూచించారు.