ఓటుకు కోట్లు వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మఅన్నారు. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన ముద్దాయని ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి చంద్రబాబు నాయుడు బేరసారాలకు దిగారని, ఈ విషయం ఈ రోజు బయటపడ్డ వీడియోలో స్పష్టంగా కనబడుతుందన్నారు.