‘పొత్తు లేకుండా ఒక్కరైనా గెలుస్తారా’? | Chandrababu Meeting With Telangana TDP Leaders Over Alliances | Sakshi
Sakshi News home page

‘పొత్తు లేకుండా ఒక్కరైనా గెలుస్తారా’?

Published Sun, Sep 9 2018 1:27 PM | Last Updated on Sun, Sep 9 2018 1:27 PM

Chandrababu Meeting With Telangana TDP Leaders Over Alliances - Sakshi

చంద్రబాబు నాయుడు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరబాద్‌ : చంద్రబాబు నివాసంలో తెలంగాణ తెలుగు దేశం ముఖ్యనేతల సమావేశం కొనసాగుతోంది. రెండు గంటలపాటు టీటీడీపీ నేతలతో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జరిపిన చర్చల్లో.. పొత్తులు ఉంటాయంటూ చంద్రబాబు నేతలకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. నిన్న జరిగిన జనరల్‌ బాడీ మీటింగ్‌ అనంతరం కాంగ్రెస్‌తో పొత్తు వద్దంటూ ఎల్‌ రమణ చంద్రబాబుకు చెప్పారు. దీంతో రమణతో పాటు ఇతర నేతలను ఆయన మందలించారు.  పొత్తులు లేకుండా ఒక్కరైనా గెలుస్తారా అంటూ వారిని చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీని తెలంగాణలో కాపాడుకోవాలంటే పొత్తులు తప్పవు.. అందుకు తగ్గట్టుగా సిద్దంగా ఉండాలని సూచించారు.

ఇవాళ మీటింగ్‌లో సైతం కాంగ్రెస్‌తో పొత్తుపైనే ముఖ్యనేతలతో మరోసారి చంద్రబాబు చర్చించారు. కాంగ్రెస్‌తో పొత్తు వద్దనే నేతలు, పొత్తు కోరుకునే వారితో చర్చించారాయన. ఒక్క కాంగ్రెస్‌తోనే పొత్తు అంటే పార్టీ సిద్దాంతాలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, జనసమితి ఇతర పార్టీలతో కూటమి కట్టేలా సమాలోచనలు చేయాలని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. రేపటిలోగా ఒక నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ నేతలను ఆదేశించినట్లు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement