హైదరాబాద్: సభా హక్కులు ఉల్లంఘించారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్పై టీటీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీలు నోటీసులిచ్చారు. తెలంగాణ మంత్రులు ప్రోటోకాల్ పాటించడం లేదని వారు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ మంత్రులు ప్రోటోకాల్ ను పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. దీనిపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, గాంధీ తెలిపారు.