టీఆర్‌ఎస్‌కు అనుబంధ సంఘంగా బీజేపీ!
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : సచివాలయానికి రాని ముఖ్యమంత్రిగా పేరుపడ్డ కేసీఆర్‌కు మొదటి ర్యాంకు ఎలా ఇస్తారో ర్యాంకులు ఇచ్చిన వారే సమాధానం చెప్పాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పనిచేసే వాళ్లకు కాకుండా పడుకునే వాళ్లకు మొదటి ర్యాంకు ఇచ్చిన కేంద్రం వైఖరి విడ్డూరంగా ఉందన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో ఏబీవీపీ నాయకులు, పలువురు విద్యార్థులు టీఎన్‌ఎస్‌ఎఫ్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
కేంద్రం నుంచి వచ్చిన ఓ నాయకుడు రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందనంటే, మరో నేత పాలన అద్భుతంగా ఉందనడం హాస్యాస్పదమన్నారు. కేం ద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కేసీఆర్‌కు తోక పార్టీగా మారింద న్నారు. కాంగ్రెస్, బీజేపీలు టీఆర్‌ఎస్‌కు అనుబంధ సంఘాలుగా మారాయని ఎద్దేవా చేశారు.