
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి సొంత నియోజకవర్గంలోనే భారీ షాక్ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 700మంది కార్యకర్తలు, నాయకులు తెలంగాణ భవన్‌లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డిల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పాల్గొన్నారు. వీరందరికీ టీఆర్ఎస్ కండువాలు కప్పి మంత్రులిద్దరూ స్వాగతం పలికారు.
టీఆర్ఎస్‌లో చేరిన వారిలో కొడంగల్ మండలం చిట్లపల్లి ఎంపీటీసీ ప్రవీణ్‌కుమార్, శరణమ్మ, హనుమంతురెడ్డి, కొడంగల్ జెడ్పీటీసీ, టీడీపీ దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, టీడీపీకి చెందిన దౌల్తాబాద్ సర్పంచ్ పార్వతమ్మ, గుండెపల్లి సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, చంద్రకల్ సర్పంచ్ మాధవి, ఉప సర్పంచ్ ఆశన్న, దౌల్తాబాద్ మండలం కో ఆప్షన్ మెంబర్ జాకీర్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు(కోస్గి) చిన్నారెడ్డి, బిజ్జరాం టీడీపీ సర్పంచ్ కళావతి, మాజీ సర్పంచ్ వడ్ల వెంకటయ్య, బిజ్జారం గ్రామ పార్టీ అధ్యక్షుడు పటేల్ బస్వరాజు, దౌల్తాబాద్ మండలం అంతారం మాజీ ఉప సర్పంచ్ బసంత్ రెడ్డి, దౌల్తాబాద్ పీఏసీఎస్ డైరెక్టర్ రాజప్ప, దౌల్తాబాద్ మండలం గోకపస్లాబాద్ మాజీ ఎంపీటీసీ ఆనంతయ్య, దౌల్తాబాద్ మండల కేంద్రం నుంచి వార్డ్ మెంబర్లు నారాయణ, ఎల్లమ్మ, మల్కయ్య గౌడ్, శ్రీనివాస్, పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment