
'రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలి'
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులూ ఇవ్వజూపుతూ ఏసీబీకి పట్టుబడ్డ టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని సీతారం డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులూ ఇవ్వజూపుతూ ఏసీబీకి పట్టుబడ్డ టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని సీతారం డిమాండ్ చేశారు. ఓటుకు నోటు వ్యహహారంలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకపోతే రేవంత్ ను సస్పెండ్ చేయడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రశ్నించారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన తమ్మినేని.. టీడీపీ నుంచి రేవంత్ ను తక్షణమే సస్పెండ్ చేయాలన్నారు. ఒకవేళ లేదంటే ఆ అంశానికి నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు.