
గవర్నర్ అపాయింట్ మెంట్ దొరకడం లేదు: టీటీడీపీ
రాష్ట్ర ప్రజల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు గత 15 రోజులుగా ప్రయత్నిస్తున్నా ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదని టీటీడీపీ పేర్కొంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు గత 15 రోజులుగా ప్రయత్నిస్తున్నా ఆయన అపాయింట్‌మెంట్ దొరకడం లేదని టీటీడీపీ పేర్కొంది. ప్రజా సమస్యల పరిష్కారానికి గవర్నర్ కార్యాలయాన్ని కూడా వేదికగా భావిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలకు అడగ్గానే అపాయింట్‌మెంట్ ఇస్తున్న గవర్నర్ కార్యాలయం... టీడీపీకి ఇవ్వకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాడుతున్న రాజకీ య పార్టీలకు అపాయింట్‌మెంట్ ఇచ్చే విషయంలో సముచితస్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.