ఒంటేరు ప్రతాపరెడ్డి విమర్శ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ టీఆర్‌ఎస్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందని టీటీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఒంటేరు ప్రతాపరెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ అరాచకాలను ప్రశ్నించేందుకు ప్రతిపక్షం ఉండకూడదన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. నారాయణ్‌ఖేడ్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లను కూడా పోలింగ్ స్టేషన్లకు రాకుండా అడ్డుకున్నారని, టీఆర్‌ఎస్‌కు ఓటేయకపోతే పింఛన్లు, రేషన్‌కార్డులు రద్దు చేస్తామని మంత్రి హరీశ్‌రావు బెదిరించారన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీఆర్‌ఎస్
Published Mon, Feb 15 2016 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM
Advertisement