తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఓటమి ఎరుగని నాయకులం తాను, కేసీఆరేనని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఓటమి ఎరుగని నాయకులం తాను, కేసీఆరేనని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పర్వతగిరిలో గురువారం ఏర్పాటుచేసిన టీడీపీ మాజీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ పేదల సంక్షేమం కోసమే పని చేసిందని, అయితే ఇప్పుడు ఆంధ్ర పార్టీగా ముద్ర పడిందని అన్నారు.
టీడీపీని వీడినందుకు బాధగా ఉందని ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. మంత్రి పదవి కోసమో, స్వార్థం కోసమో టీఆర్‌ఎస్‌లోకి రాలేదని, కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితుడినయ్యానని.. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం, గౌరవం కోసమే వచ్చానని చెప్పారు.
లోక్‌సభ ఉప ఎన్నిక ముందు టీఆర్‌ఎస్‌లో చేరితే మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ అన్నారని, అయినా.. అప్పుడు టీడీపీని వీడలేదని అన్నారు. హైదరబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు కూడా టీఆర్‌ఎస్‌నే ఆదరించారని గుర్తు చేశారు. పశ్చిమబెంగాల్‌లో జ్యోతిబసు లాగే వచ్చే ఐదు టర్మ్‌లు కూడా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పారు. సమావేశంలో వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి నారాయణరావు, నాయకులు మేడిశెట్టి రాములు, భాస్కర్‌రావు, గోనె సంపత్ తదితరులు పాల్గొన్నారు.