సీఈఓ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రూ. 550 కోట్లు మంజూరు
అత్యున్నత కార్యాలయం ఒత్తిడితో దొడ్డిదారిన ఫైలుకు ఆమోదం
మరో ఐదు రోజుల్లో సీమాంధ్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు ఆర్థిక ‘వ్యవహారాల’కు శ్రీకా రం చుట్టింది. రాష్ట్ర అత్యున్నత కార్యాలయం ఒత్తిడి మేరకు, ఒక కేంద్రమంత్రి రంగంలోకి దిగి ఈ అడ్డగోలు వ్యవహారాన్ని నడిపించారు. ఎన్నికల్లో ప్రయోజనాల కోసంఎన్నికలు కాంట్రాక్టర్లకు ఏకంగా రూ. 550 కోట్లు విడుదల చేయడానికి ఆర్థికశాఖ శుక్రవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నియమావళి అమలులో ఉండగానే.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కళ్లు కప్పి మరీ ఫైలును నడిపించేశారు. దీన్ని బట్టే ఈ తతంగం వెనుక ఎంత పెద్ద శక్తుల హస్తం ఉందో అర్థమవుతోంది.
మార్చిలోనే తిరస్కరించిన సీఈవో..
మార్చి నెలాఖరున ఇదే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు రూ. 550 కోట్ల మేర బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ఫైలును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు మార్క్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిధులను విడుదల చేయడానికి భన్వర్‌లాల్ అనుమతి కోరారు. అయితే ఫైలును పరిశీలించిన భన్వర్‌లాల్ ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తే ఆ నిధులు పార్టీలకు చేర తాయని, పార్టీలు ఆ నిధులను ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి వినియోగిస్తాయనే కారణంతో నిధుల విడుదలకు అంగీకరించలేదు. ఎన్నికలు పూర్తి అయిన తరువాతనే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని సంబంధిత ఫైలుపై భన్వర్‌లాల్ స్పష్టంగా రాశారు.
పెద్దల ఒత్తిడితో దొడ్డిదారిన ఆమోదం...
అయితే ఇప్పుడు పెద్దల ఒత్తిడితో, భన్వర్‌లాల్‌ను తోసి రాజని నేరుగా ఆర్థిక శాఖకు ఫైలును పంపడం ద్వారా నిధుల విడుదలకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఎన్నికల కన్నా ముందుగానే ఈ నిధులను విడుదల చేయించడానికి ఒక కేంద్రమంత్రి స్వయంగా ఇటీవల రాష్ట్ర అత్యున్నత కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు. అత్యున్నత కార్యాలయం ఆదేశాల మేరకు సాగునీటి శాఖ ప్రాణహిత - చేవెళ్ల కాంట్రాక్టర్లకు రూ. 550 కోట్లు విడుదల చేయడానికి కొత్తగా ఓ సమాంతర ఫైలును రూపొందించింది. ఆ ఫైలుకు సీఎస్ మహంతి కూడా ఆమోదం తెలిపారు. గతంలో సీఈవో భన్వర్‌లాల్‌కు పంపి, ఆయన అనుమతి కోరిన సీఎస్.. ఈసారి ఆ పని చేయకుండా నేరు గా ఆర్థికశాఖకు పంపించారు. ఆర్థికశాఖ అధికారులకు నిధులు ఇవ్వడానికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా.. రాష్ట్ర అత్యున్నత కార్యాలయం, కేంద్రమంత్రి ఒత్తిడితో అయిష్టంగా ఆమోదం తెలిపినట్లు చెప్తున్నారు.
కాంట్రాక్టర్లకు ‘ఎన్నికల’ నిధులు!
Published Sat, May 3 2014 12:56 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement