Chevella Project
-
రంది పడకుండ్రి.. ఆగమాగం కాకుండ్రి
ఇమాంబాద్ వాసులకు మంత్రి హరీశ్‌రావు భరోసా రామాయంపేట: ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంతో తమ ఊరు ముంపునకు గురవుతుందని, తమను ఆదుకోవాలని కంటతడి పెట్టిన సిద్దిపేట మండలం ఇమాంబాద్ గ్రామస్థులకు నేనున్నానని మంత్రి హరీశ్‌రావు భరో సా ఇచ్చి చెప్పి వారిని అక్కున చేర్చుకున్నారు. వివరాల్లోకి వెలితే.. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తు పెంచడంతో తమ ఊరు ముంపునకు గురవుతుందనే భయంతో గ్రామస్థులు శుక్రవారం రామాయంపేటకు తరలివచ్చి మంత్రి హరీశ్‌రావు ఎదుట మొరపెట్టుకొని కంటతడి పెట్టారు. దీనితో చలించిపోయిన హరీశ్ ‘రంది పడకుండ్రి,- ఆగమాగం కాకుండ్రి’ అంటూ వారికి భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు ఎత్తు 1.5 నుంచి 4 టీఎంసీల మేర పెంచితే సుమారుగా 40 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని వివరించారు. చెప్పుడు మాటలు వినకుండ్రి, మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. సింగూరు నీరంతా మెతుకుసీమకే సింగూర్ ప్రాజెక్ట్ నీటిని పూర్తిగా మెతుకు సీమకే వినియోగిస్తామని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. శుక్రవారం పాపన్నపేట మండలం బాచారంలోని గుండు వాగు, దౌలాపూర్‌లో పాపన్నపేట యేటి కాల్వ, ఏడుపాయల్లో ఘణపురం ప్రాజెక్ట్ ఎత్తు పెంపు పనులకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం వివిధ ప్రదేశాల్లో మాట్లాడుతూ మెతుకు సీమలో పయనిస్తున్న మంజీరా నీటిని ఇకముందు జిల్లా వాసులకే వినియోగించే సమయం ఆసన్నమైందన్నారు. కృష్ణ -1, కృష్ణ -2, గోదావరి జలాలను హైదరాబాద్‌కు మల్లించడంతో ఇక సింగూర్ నీటిని స్థానికంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనపురం ఆనకట్ట కోసం సుమారు కోటిరూపాయలు మంజూరుచేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆనకట్ట ఎత్తును 1.73మీటర్లకు పెంచుతామని తెలిపారు. ఫలితంగా మరో 5వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ 30 యేళ్లుగా నానుతున్న గుండు వాగు, పాపన్నపేట యేటి కాల్వలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావులు నిధులు విడుదల చేసి పాపన్నపేట మండల రైతులకు మరిచిపోలేని ప్రయోజనం చేకూర్చారని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి ప్రసంగించారు. కొర్విపల్లిని ఆదర్శంగా తీసుకోవాలి చిన్నశంకరంపేటః ఓకే రోజు వంద శాతం ఇంకుడు గుంత లు నిర్మించిన కొర్విపల్లిని ఆదర్శంగా తీసుకుని మిగత గ్రామాలు ముందుకుసాగాలని మంత్రి హరీష్‌రావు కోరారు. శుక్రవారం చిన్నశంకరంపేట కొర్విపల్లిలో చేపట్టిన ఓకే రోజు వందశాతం ఇంకుడు గుంతల నిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ. 200 కోట్లతో గోదాముల నిర్మాణం మెదక్: రాష్ట్రంలో రూ. 1,024 కోట్లతో 200 గోదాములు నిర్మిస్తుండగా, ఒక్క మెదక్ జిల్లాకే రూ. 200 కోట్ల కేటాయించినట్లు మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని మార్కెట్లలో రైతుల అవసరాల మేరకు విశ్రాంత గృహాలు, కవర్ షెడ్ల నిర్మాణం, టాయిలెట్లు, క్యాంటీన్లను నిర్మించడం జరుగుతుందన్నారు. వ్యవసాయానికి ఉచితంగా 9 గంటల నిరంతర విద్యుత్ పగటిపూట సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం డ్యామ్ నుంచి నీటిని మళ్లించే జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. గత పాలకుల పాపం తోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందన్నారు. దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాకు 14వ ఆర్థిక సంఘం నుంచి రూ. 119 కోట్లు రాబోతున్నాయని, 2014-15లో రూ. 53 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, జడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ప్రజల గొంతు కోశారు
► ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ► రీడిజైన్‌తో అన్యాయం ► టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌యాదవ్ బెజ్జూర్ : ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్‌తో జిల్లా ప్రజల గొంతు కోశారని టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. శుక్రవారం మండంలోని తలా యి గ్రామాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ల నీరు జిల్లాకు కేటాయించిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేశారు. రీడిజైన్ కారణంగా రూ.కోట్ల ప్రజాధనంవృథాపోతుందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ప్రాణహిత చేవెళ్ల, అంబేద్కర్ సృజల స్రవంతిని తీసుకవచ్చిన గణత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. తలాపునే ప్రాణహిత నీరున్నా తలాయి గ్రామానికి నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అక్కడి గ్రామస్తులు కిలో మీటర్ల దూరం నుంచి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామన్నారు. కమీషన్ల కోసమే ప్రాణహితను కాళేశ్వరానికి మార్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు, గజ్జి రామయ్య మాట్లాడారు. తాము ప్రజాసమస్యలపై పోరాటం చేస్తుంటే టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో తిరగనివ్వబోమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నాయకులు శ్రీవర్ధన్, వసంతరావు, కోండ్ర బ్రహ్మయ్య, విలాస్‌గౌడ్, తదితరులున్నారు. -
నా పెళ్లి ఆపేయండి మేడమ్..?!
♦ జేసీ ఆమ్రపాలికి ఓ బాలిక మొర ♦ నేరుగా కలెక్టరేట్‌కు వె ళ్లిన వైనం బాల్యంలోనే పెళ్లి చేయాలనే తన తండ్రి ఆలోచనకు ఓ బాలిక అడ్డు తగిలింది. తనకు చిన్న వయసులోనే పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వినని తండ్రిపై విసుగు చెంది ఏకంగా కలెక్టరేట్ గడప తొక్కింది. తనకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని.. ఇంకా చదువుకుంటానని జాయింట్ కలెక్టర్‌కు తెగేసి చెప్పింది. ఏదైనా చదువులమ్మ ఒడిలో తనను చేర్చాలని ఆ సరస్వతి పుత్రిక కోరింది. మొయినాబాద్: నా వయసు పదహారేళ్లే.. మా నాన్న నాకు ఇప్పుడే పెళ్లి చేయాలని చూస్తున్నాడు.. నాకిష్టం లేదు.. పెళ్లి చేసుకోకపోతే చెల్లిని, తమ్ముడిని చంపేస్తానని బెదిరిస్తున్నారు.. నాకింకా చదువుకోవాలని ఉంది.. ఎలాగైనా నా పెళ్లి ఆపేయండి మేడమ్.. నన్ను చదివించండి అంటూ ఓ బాలిక రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలికి మొరపెట్టుకుంది. మొయినాబాద్ మండలం మేడిపల్లికి చెందిన ఓ బాలిక (16) గతేడాది పదో తరగతి పూర్తి చేసింది. ఆమె వయసు 16 ఏళ్లు. అయితే తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని చూస్తుండడంతో ఇష్టంలేని ఆ బాలిక శనివారం నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లింది. జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలిని కలిసి తన పెళ్లిని ఆపేయాలని కోరింది. తనకు పెళ్లి చేసేందుకు తన తండ్రి ప్రయత్నిస్తున్నాడని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. పెళ్లి చేసుకోకపోతే తన చెల్లిని, తమ్ముడిని చంపేస్తానని తండ్రి బెదిరిస్తున్నాడని వాపోయింది. తనకు చదువుకోవాలని ఉందని, ఎక్కడైనా హాస్టల్లో ఉంచి చదివించాలని కోరింది. తాను తిరిగి ఇంటికి వెళ్తే తన తండ్రి చంపేస్తాడని తెలిపింది. దీంతో వెంటనే స్పందించిన జేసీ ఆ బాలికను స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ఆమెను అక్కడి నుంచి రెస్క్యూ హోమ్‌కు తరలించారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఐసీడీఎస్ చేవెళ్ల ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
గవర్నర్‌ను కలిసిన అఖిలపక్ష బృందం
-
కాంట్రాక్టర్లకు ‘ఎన్నికల’ నిధులు!
సీఈఓ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రూ. 550 కోట్లు మంజూరు అత్యున్నత కార్యాలయం ఒత్తిడితో దొడ్డిదారిన ఫైలుకు ఆమోదం మరో ఐదు రోజుల్లో సీమాంధ్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు ఆర్థిక ‘వ్యవహారాల’కు శ్రీకా రం చుట్టింది. రాష్ట్ర అత్యున్నత కార్యాలయం ఒత్తిడి మేరకు, ఒక కేంద్రమంత్రి రంగంలోకి దిగి ఈ అడ్డగోలు వ్యవహారాన్ని నడిపించారు. ఎన్నికల్లో ప్రయోజనాల కోసంఎన్నికలు కాంట్రాక్టర్లకు ఏకంగా రూ. 550 కోట్లు విడుదల చేయడానికి ఆర్థికశాఖ శుక్రవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నియమావళి అమలులో ఉండగానే.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కళ్లు కప్పి మరీ ఫైలును నడిపించేశారు. దీన్ని బట్టే ఈ తతంగం వెనుక ఎంత పెద్ద శక్తుల హస్తం ఉందో అర్థమవుతోంది. మార్చిలోనే తిరస్కరించిన సీఈవో.. మార్చి నెలాఖరున ఇదే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు రూ. 550 కోట్ల మేర బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ఫైలును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు మార్క్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిధులను విడుదల చేయడానికి భన్వర్‌లాల్ అనుమతి కోరారు. అయితే ఫైలును పరిశీలించిన భన్వర్‌లాల్ ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తే ఆ నిధులు పార్టీలకు చేర తాయని, పార్టీలు ఆ నిధులను ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి వినియోగిస్తాయనే కారణంతో నిధుల విడుదలకు అంగీకరించలేదు. ఎన్నికలు పూర్తి అయిన తరువాతనే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని సంబంధిత ఫైలుపై భన్వర్‌లాల్ స్పష్టంగా రాశారు. పెద్దల ఒత్తిడితో దొడ్డిదారిన ఆమోదం... అయితే ఇప్పుడు పెద్దల ఒత్తిడితో, భన్వర్‌లాల్‌ను తోసి రాజని నేరుగా ఆర్థిక శాఖకు ఫైలును పంపడం ద్వారా నిధుల విడుదలకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ఎన్నికల కన్నా ముందుగానే ఈ నిధులను విడుదల చేయించడానికి ఒక కేంద్రమంత్రి స్వయంగా ఇటీవల రాష్ట్ర అత్యున్నత కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు. అత్యున్నత కార్యాలయం ఆదేశాల మేరకు సాగునీటి శాఖ ప్రాణహిత - చేవెళ్ల కాంట్రాక్టర్లకు రూ. 550 కోట్లు విడుదల చేయడానికి కొత్తగా ఓ సమాంతర ఫైలును రూపొందించింది. ఆ ఫైలుకు సీఎస్ మహంతి కూడా ఆమోదం తెలిపారు. గతంలో సీఈవో భన్వర్‌లాల్‌కు పంపి, ఆయన అనుమతి కోరిన సీఎస్.. ఈసారి ఆ పని చేయకుండా నేరు గా ఆర్థికశాఖకు పంపించారు. ఆర్థికశాఖ అధికారులకు నిధులు ఇవ్వడానికి ఏ మాత్రం ఇష్టం లేకపోయినా.. రాష్ట్ర అత్యున్నత కార్యాలయం, కేంద్రమంత్రి ఒత్తిడితో అయిష్టంగా ఆమోదం తెలిపినట్లు చెప్తున్నారు.