హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్రలోని పది జిల్లాల్లోని 29 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం రీ పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలో గత నెల 30న, ఈ నెల 7న సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల ఓటింగ్ యంత్రాలు మధ్యలో పనిచేయడం మానేశాయి. వాటిని మార్చి కొత్త యంత్రాలను అమర్చి పోలింగ్ నిర్వహించారు. అయితే ఇలాంటి చోట్ల రీ పోలింగ్ అవసరం లేదని కలెక్టర్లు నివేదించినప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ రీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం 29 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వివరాలు ఇవీ..
నిజామాబాద్ లోక్‌సభకు బోధన్ అసెంబ్లీ పరిధిలోని 64వ పోలింగ్ కేంద్రం జహీరాబాద్ లోక్‌సభకు జుక్కల్ అసెంబ్లీ పరిధిలోని 134వ పోలింగ్ కేంద్రం బాన్సువాడ అసెంబ్లీ స్థానానికి 146వ పోలింగ్ కేంద్రం జహీరాబాద్ లోక్‌సభకు బాన్సువాడ అసెంబ్లీ పరిధిలోని 39, 187 పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానానికి 48, 168 పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ పరిధిలోని 9వ పోలింగ్ కేంద్రం కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానానికి 371/ఎ పోలింగ్ కేంద్రం కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి 161వ పోలింగ్ కేంద్రం భద్రాచలం అసెంబ్లీ స్థానానికి 239వ పోలింగ్ కేంద్రం శ్రీకాకుళం లోక్‌సభకు శ్రీకాకుళం అసెంబ్లీ పరిధిలోని 46వ పోలింగ్ కేంద్రం కురుపాం అసెంబ్లీ స్థానానికి 192వ పోలింగ్ కేంద్రం అరకు లోక్‌సభకు సాలూరు అసెంబ్లీ పరిధిలోని 134వ పోలింగ్ కేంద్రం అరకు లోక్‌సభ, పాడేరు అసెంబ్లీ స్థానానికి 68వ పోలింగ్ కేంద్రం మచిలీ పట్నం లోక్‌సభకు గుడివాడ అసెంబ్లీ పరిధిలోని 123వ పోలింగ్ కేంద్రం మచిలీపట్నం లోక్‌సభకు అవనిగడ్డ అసెంబ్లీ పరిధిలోని 29వ పోలింగ్ కేంద్రం అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి 91వ పోలింగ్ కేంద్రం పెనమలూరు అసెంబ్లీ స్థానానికి 59, 172 పోలింగ్ కేంద్రాలు విజయవాడ లోక్‌సభకు విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ పరిధిలోని 212వ పోలింగ్ కేంద్రం విజయవాడ లోక్‌సభకు మైలవరం అసెంబ్లీ పరిధిలోని 123వ పోలింగ్ కేంద్రం నందిగామ అసెంబ్లీ స్థానానికి 171, 174 పోలింగ్ కేంద్రాలు విజయవాడ లోక్‌సభకు జగ్గయ్యపేట అసెంబ్లీ పరిధిలోని 122వ పోలింగ్ కేంద్రం కరీంనగర్ లోక్‌సభకు హుస్నాబాద్ పరిధిలోని 170వ పోలిం గ్ కేంద్రం కడప పార్లమెంట్‌కు, జమ్మలమడుగు అసెంబ్లీకి 80, 81,82 పోలింగ్ కేంద్రాలు.
29 కేంద్రాల్లో నేడు రీ పోలింగ్
Published Tue, May 13 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM
Advertisement