మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సీమాంధ్ర మంత్రుల సమావేశం ముగిసింది. సమైక్యరాష్ట్రం తప్ప మరేదీ ఆమోదనీయం కాదు, పరిష్కారం లేదని భేటీ ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ మంత్రి శైలజానాథ్ అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌ల ద్వారా హైకమాండ్‌కు తమ వాదనలు వినిపిస్తామన్నారు. కేంద్ర మంత్రులు, సీమాంధ్ర ఎంపీలను సమన్వయ పరుచుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా ఎల్లుండి ఉదయం ఢిల్లీ వెళ్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే పార్టీ పరంగా జరిగే నష్టాన్ని హైకమాండ్‌కు వివరిస్తామన్నారు. తాము హైకమాండ్ను నమ్ముతున్నామని, అధిష్టానం కూడా తమను విశ్వసించాలన్నారు. అవసరమైతే రాజీనామాలకు సిద్ధపడాలని నిర్ణయించుకున్నామని శైలజానాథ్ తెలిపారు. సమావేశం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసేందుకు సీమాంధ్ర మంత్రులు క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.