వైఎస్, బాబు పాలనలో.. అర్చకుల సంక్షేమం
గుళ్ల నుంచి ఇళ్ల దాకా ఏ శుభకార్యం జరగాలన్నా, భగవంతుడికి-భక్తుడికి అనుసంధానంగా వుండాలన్నా పూజారి ఉండాల్సిందే. కానీ, అంత ప్రాముఖ్యత ఉన్న బ్రాహ్మణుల జీవితాల్లో మాత్రం అంతా చీకటే! రాష్ట్రంలో సుమారు 82 లక్షల మంది బ్రాహ్మణులు ఉండగా, 30 శాతం అర్చకత్వంపై ఆధారపడి జీవిస్తున్నారు. చాలాచోట్ల పూజారుల నెలసరి ఆదాయం రూ. 1500, పురోహితుల ఆదాయం రూ. 2000కు మించి ఉండదు. అందుకే, వీరిలో చాలామంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. అయితే, బాధాకరమైన విషయమేంటంటే, వీరికి తెల్ల రేషన్ కార్డులు కూడా లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలు అందడం లేదు. చాలామందికి సొంత ఇళ్లు కూడా లేవు. 12 ఏళ్లపాటు అభ్యసించిన వేదవిద్యకు ఆదాయం ఈ రకంగా ఉండడంతో చాలామంది నిరుత్సాహపడి అర్చక వృత్తినే వదిలేస్తున్నారు.రాష్ట్రంలో 84 వేల ఆలయాలున్నా, దేవాదాయ శాఖ మాత్రం ఆదాయమున్న 100 ఆలయాల కోసమే అన్నట్లు పనిచేస్తోంది.
బాబు పాలన
చంద్రబాబునాయుడు అర్చకుల గోడు ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా అర్చకుల, దేవాలయాల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న 1987 దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేశారు. 2001లో పూజారులను తొలగించేందుకు రిటైర్‌మెంట్ స్కీంను కూడా పెట్టారు. జీతాలు లేవు... పెన్షన్లు లేవు... రిటైర్‌మెంటు మాత్రం పెట్టి అనేకమందిని వెళ్లగొట్టారు. దీంతో అర్చకులు అల్లల్లాడిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లో భీమసేనాచారి అనే అర్చకుడి కి 58 ఏళ్లు నిండాయని, రేపటి నుంచి రాకూడదని నోటీసు వచ్చింది. దీంతో తనకు దిక్కూమొక్కూ లేదని భావించిన భీమసేనాచారి 2001 సెప్టెంబర్ 17 తెల్లవారుజామున గుడి గంటకు అంగవస్త్రంతో ఉరి వేసుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాజన్న రాజ్యం
వైఎస్సార్ 2003లో ‘ప్రజాప్రస్థానం’లో అర్చకులు పడే అవస్థలను, దేవాలయాల్లో పరిస్థితిని కళ్లారా చూశారు. చిలుకూరు వెంకటేశ్వరుడిని సందర్శించుకున్న సందర్భంగా ‘అధికారంలోకి వస్తే దేవాలయాల్ని రక్షిస్తారా?’ అని వైఎస్సాఆర్‌ను అర్చకులు అడిగారు. తప్పకుండా చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. పాదయాత్ర ముగిశాక ఎన్నికల ప్రణాళికలో 1987 దేవాదాయ చట్టాన్ని సవరిస్తానన్న హామీని పొందుపరిచారు. ఈ అంశంపై సోనియా వద్ద కూడా చర్చ పెట్టారు కూడా. ఈ హామీతో వైఎస్సాఆర్‌కు ఓటు వేయమని కోరుతూ దేవుడికి రెండు ప్రదక్షిణలు అదనంగా చేయమని అర్చకులు భక్తులకు విన్నవించారు. 2004లో వైఎస్సార్ అఖండ మెజారిటీతో గెలుపొందారు. 2007లో చ ట్టాన్ని సవరించారు.
- అర్చక వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. అందులో ప్రస్తుతం రూ. 130 కోట్లు ఉన్నాయి. దాని ద్వారా వచ్చే వడ్డీ నుంచి దేవాలయాలకు సాయం చేస్తుంటారు
- అర్చకులకు ఆరోగ్య బీమా సౌక ర్యం కల్పించారు
- విద్య గృహ నిర్మాణానికి రుణాలు అందజేశారు
- గ్రాట్యుటీ, పెన్షన్ స్కీంను ఏర్పాటు చేశారు
- ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి ఉంటే అర్చక సంక్షేమ నిధి నుంచి రూ. లక్ష ఇచ్చే వెసులుబాటు కల్పించారు
- కామన్‌గుడ్ ఫండ్‌ను ఏర్పాటు చేసి దేవాలయాల
- పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు
జగన్ సంకల్పం
హిందూ దేవాదాయ, ధర్మాదాయ సంస్థల నిర్వహణలో ప్రభుత్వ జోక్యాన్ని క్రమంగా తగ్గించటానికి మేము కట్టుబడి ఉన్నాం. అర్చకులకు, దేవాలయాల సిబ్బందికి పనిచేసేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తాం. ధూప దీప నైవేద్యాల కోసం ఇప్పుడు ఇస్తున్న కనీస మొత్తాన్ని నెలకు రూ. 2500 నుంచి రూ.5000కు పెంచుతాం. హిందూ దేవాలయాల విషయంలో, అర్చకుల విష యంలో వైయస్‌ఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు పరచటానికి కట్టుబడి ఉన్నాం. ధూప, దీప, నైవేద్యాల కోసం ఇచ్చే నిధులను, పదవీ విరమణ చేసిన అర్చకుల పింఛన్‌ను పెంచుతాం.