బాబు, వైఎస్ పాలనలో.. చేనేత
బాబు పాలన: నేత కార్మికుల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లు చంద్రబాబు చిన్నచూపు చూశారు. పింఛను విషయంలో కానీ, ఆత్మహత్య చేసుకున్న వారికి పరిహారం ఇప్పించే విషయంలో కానీ ఏనాడూ సానుభూతితో ఆలోచించలేదు. పెపైచ్చు నష్టపరిహారం చెల్లిస్తే ఆత్మహత్యలు మరింత పెరుగుతాయంటూ పరిహాసం చేశారు.
- 1999లో సిరిసిల్ల శివారులోని రాజీవ్‌నగర్‌లో కొండ కిష్టయ్య అనే నేత కార్మికుడు భార్యాపిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుం బంలో నలుగురు చనిపోగా కుమార్తె మిగిలింది. ఈ ఘటన సంచలనం సృష్టించినా ముఖ్యమంత్రిగా ఉన్న బాబు పరామర్శకు సిరిసిల్ల రాలేదు. చేనేత మంత్రి పడాల భూమన్నను పంపి చేతులు దులుపుకున్నారు.
- బాబు హయాంలో 1999-2004 మధ్య 200మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పైసా పరిహారం కూడా ఇవ్వలేదు. కుటుంబ ప్రయోజన పథకంలో కేవలం రూ.ఐదువేలు ఇచ్చి సరిపుచ్చారు.
- నేత కార్మికులకు పింఛనివ్వాలని బాబు ఆలోచించలేదు. అందరితోపాటు 60ఏళ్లు నిండిన వారికి రూ.75 మాత్రమే పింఛనుగా నిర్ణయించారు.
- చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను విక్రయించేందుకు ఏర్పాటు చేసిన ఆప్కో షోరూంలలో దాదాపు వంద వరకు మూసేశారు.
- ఎన్టీఆర్ ప్రారంభించిన జనతా వస్త్రాల పథకాన్ని సైతం రద్దు చేశారు.
- బాబు హయాంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఎక్కువగా ఉండేవి. చాలామంది నేత కార్మికులు ఉపాధి లేక భివండి, సూరత్‌లకు వలసపోయారు.
రాజన్న రాజ్యం
సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు వైఎస్ ఆర్థికసాయం అందించారు. మొత్తం 125 కుటుంబాలకు రూ. లక్షన్నర చొప్పున సాయం చేశారు. 1997 నుంచి ఆత్మహత్యలకు పాల్పడ్డ నేతన్నలకు ఈ ప్యాకేజీ వర్తింపజేశారు. ఇందులో కార్మికుడి అప్పుల సర్దుబాటుకు రూ. యాభైవేలు, కుటుంబ జీవనోపాధికి మరో రూ.లక్ష అందించారు. మరో 120 కుటుంబాలకు రూ.25వేల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు.
- 12వేల మంది నేత కార్మికులకు అంత్యోదయ అన్న యోజన పథకం(ఏఏవై) కార్డులు అందించారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి నెలనెలా 35కిలోల బియ్యం అందుతున్నాయి.
- చేనేత కార్మికుల ఆరోగ్య సమస్యల దృష్ట్యా 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన వైఎస్ 50వేల మందికి ప్రతి నెలా రూ.200 పింఛనిచ్చారు.
- 2004లో రూ.32కోట్లు ఉన్న ఆప్కో టర్నోవర్‌ను రూ.250కోట్లుగా మార్చి ఆదుకున్నది వైఎస్సే.
- పెరిగిన చిలపనూలు ధరల వల్ల కార్మికులు ఇబ్బంది పడుతుంటే వైఎస్ పదిశాతం సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారు.
- వైఎస్ హయాంలో 2008 నాటికి వలసలు తగ్గాయి. ఆదాయం లేకపోవడంతో మహారాష్ట్రకు వెళ్లే బస్సులు రద్దయ్యాయి.
- సిరిసిల్ల స్త్రీలను చైతన్యవంతులను చేసి 1,480 సంఘాలు ఏర్పాటు చేసి ప్రతి స్త్రీకి రూ.50వేల రుణం అందించారు. ఒక్క సిరిసిల్లలోనే రూ.74 కోట్ల పావలావడ్డీ రుణమివ్వడంతో మైక్రోఫైనాన్స్ వేధింపులు తగ్గాయి.
- చేనేత కార్మికుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ శిబిరం ఏర్పాటు చేసి 84 మంది వైద్యులతో వైద్య సేవలు అందించారు.
- ఇళ్లు లేని పేద చేనేత కార్మికులకు సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి, మండెపల్లి, సారంపల్లిలో 4,800 కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ.
- సిరిసిల్ల పట్టణ తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కరీంనగర్ ఎల్‌ఎండీ నుంచి నీరందించేందుకు రూ.36.50కోట్ల పథకాన్ని గ్రాంటు రూపంలో మంజూరు చేశారు.
- నేతన్నల సంక్షేమం కోసం రూ. 2 కోట్ల కార్పస్‌ఫండ్ మంజూరు చేశారు.
- జనశ్రీ బీమాలో కార్మికుల ప్రీమియంను రూ.80నుంచి రూ.40కి తగ్గించి మిగతా రూ.40 ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేసి లక్షన్నరమంది కార్మికులకు ఆరోగ్య ధీమా కల్పించారు.
- నేత కార్మికులు ప్రైవేటు రుణాల బారిన పడకుండా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల విధానాన్ని ప్రవేశపెట్టి పావలావడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేశారు.
- రాష్ట్ర వ్యాప్తంగా 77వేలకు పైగా ఉన్న పవర్‌లూంలకు 2004-05 నుంచి 2008-09 నాటికే రూ.29.55 కోట్ల విద్యుత్ సబ్సిడీ నిధుల విడుదల.
- 2 లక్షలమంది కార్మికులకు ఉపయోగపడేలా పావలా వడ్డీకే రుణాలిచ్చారు.
- వైయస్సార్ సిఎం అయ్యాక 327 కోట్ల రూపాయల మేరకు చేనేత రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2 లక్షలమంది చేనేత కార్మికులకు మేలు జరిగే ఈ నిర్ణయం అమలు చేయాల్సిన దశలో ఆయన హఠాన్మరణం చెందారు. రోశయ్య సిఎం అయ్యాక ఈ పథకానికి కోత విధించారు. కేవలం రూ.148 కోట్లతో 67 వేలమందికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా చేసి వైయస్సార్ ఆశయాలపై నీళ్లు చల్లారు.
జగన్ సంకల్పం
- చేనేత కార్మికులు వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలు మాఫీ చేస్తాం. చేనేత కార్మికులకు రూ లక్ష వరకూ వడ్డీ లేని రుణాలివ్వటమే కాకుండా వారికి చేనేత షెడ్డుతో కలిపి ఇల్లు కట్టించి ఇస్తాం. మరమగ్గాల చేనేత కార్మికులకు యూనిట్‌కు రూ. 1.50కి విద్యుత్ సరఫరా చేస్తాం. ముడి పదార్థాల మీద సబ్సిడీ పెంచుతాం. జనతా వస్త్రాల పథకాన్ని పునరుద్ధరించటం ద్వారా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ, పాఠశాలల్లోనూ చేనేత వస్త్రాల వినియోగాన్ని తప్పనిసరి చేస్తాం. ఆర్టిజాన్ కార్డులపై ప్రయోజనాలు కల్పిస్తాం. చేనేత కార్మికుల పింఛన్‌ను రూ. 1000కి పెంచుతాం.