
జగన్ లాంటి నాయకుడే అవసరం
రాజకీయాల్లోకి యువత వస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే నిదర్శనం. నేను పంజాబ్‌లో పుట్టాను. హర్యానాలో పెరిగాను. పూణేలో సెటిల్ అయ్యా. సినిమాల్లో హీరోయిన్ చాన్స్ రావడంతో ఆర్నెల్ల కితం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యా. మొదటి నుంచి రాజకీయాలపై అవగాహన, ఆసక్తి ఉన్న నాకు రాష్ట్రంలో జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడకు లక్షలాదిగా జనం రావడం ఆశ్చర్యం కలిగించింది.
అంతటి జనాకర్షకశక్తి ఇప్పుడు ఏ నేతకూ లేదు. కేవలం పేదప్రజల పట్ల ఆయన చూపించే ప్రేమాభిమానాలే అంతటి ఆదరణకు కారణమని తెలుసుకున్నా. ఇప్పుడు ప్రజలకు జగన్ లాంటి నాయకుడే అవసరం. మరో ముఖ్యమైన మాట ఏంటంటే.. ప్రజలు తాము వేసిన ఓటు వృధాకాకుండా సమర్ధులైన నేతలనే ఎన్నుకోవాలి.
- సునీతా రానా, హీరోయిన్