నువ్వా.. నేనా | Big fight between ex ministers | Sakshi
Sakshi News home page

నువ్వా.. నేనా

Published Sat, Apr 12 2014 2:02 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

నువ్వా.. నేనా - Sakshi

నువ్వా.. నేనా

అసెంబ్లీ నియోజకవర్గం వరంగల్ తూర్పు

 ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 8, టీడీపీ - 3, స్వతంత్రులు -2
 ప్రస్తుత ఎమ్మెల్యే: బస్వరాజు సారయ్య(కాంగ్రెస్) రిజర్వేషన్: జనరల్
 
నియోజకవర్గ ప్రత్యేకతలు
:  రాజకీయ చైతన్యం ఎక్కువ. మైనార్టీలు, బీసీలు, ఎస్సీల ఓట్లు అధికం  ప్రస్తుతం బరిలో నిలిచింది: 15
 ప్రధాన అభ్యర్థులు వీరే..
 బస్వరాజు సారయ్య (కాంగ్రెస్)
 కొండా సురేఖ (టీఆర్‌ఎస్)
 రావు పద్మరెడ్డి (బీజేపీ)
 మెట్టు శ్రీనివాస్ (సీపీఎం)
 
 మాజీ మంత్రుల మధ్య బిగ్ ఫైట్
 
 ఇప్పుడు అందరి దృష్టి  వరంగల్ తూర్పు స్థానం మీదే ఉంది. హ్యాట్రిక్  సాధించిన మాజీ మంత్రి  బస్వరాజు సారయ్య నాలుగోసారి సత్తా చాటాలని చూస్తున్నారు. రాజకీయ జన్మనిచ్చిన పరకాలను, పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన మరో  మాజీ మంత్రి కొండా సురేఖ,  సారయ్య విజయాన్ని అడ్డుకునేందుకు  సర్వశక్తులొడ్డుతున్నారు. ఇద్దరు మాజీ మంత్రుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. బీజేపీ, సీపీఎం అభ్యర్ధులు రావు పద్మ, మెట్టు శ్రీనివాస్ ఏమేరకు ఓట్లు చీలుస్తారన్నదాని మీదే    గెలుపోటములు ఆధారపడిఉన్నాయి.

కాంగ్రెస్, టీఆర్‌ఎస్  ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  సాధారణ కార్యకర్తగా  రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సారయ్యకు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. అభివృద్ధి సానుకూల అంశం. సారయ్య  మంత్రి అయిన తర్వాత, తెలంగాణ ఉద్యమం కారణంగా నియోజకవర్గ ప్రజలకు  దూరమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత, కొందరు అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరడం ప్రతికూల అంశాలు.  

 పట్టు కోసం సురేఖ

 కొండా సురేఖ కొత్త నియోజకవర్గమైనా పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. సారయ్య వ్యతిరేకులను కలుపుకుని పోతున్నారు. టికెట్ రాక నిరాశకు గురయిన గులాబీ నేతలను బుజ్జగిస్తున్నారు.  ప్రచారం హోరుగా సాగుతున్నప్పటికీ నేతలు ఏ మేరకు సహకరిస్తారన్నది అనుమానమే. స్థానికేతరులు కావడం, నియోజకవర్గంపై పట్టులేకపోవడం ఆమెకు ప్రతికూలాంశం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరడం కూడా చర్చనీయాంశం అయింది.  
 
మోడీ జపంతో రావు పద్మ


 టీడీపీ, బీజేపీ పొత్తుల భాగంగా రావు పద్మ  బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఈమె హన్మకొండకు చెందిన వారు కావడం ప్రతికూలాంశం. టీడీపీ ఓట్లు బీజేపీకి మారుతాయా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణ కోసం బీజేపీ చేసిన యత్నం, మోడీ మంత్రమే ఆయుధంగా సాగుతున్నారు.

 అభివృద్ధి మెట్టు

 సీపీఎం అభ్యర్ధి మెట్టు శ్రీనివాస్ ప్రజా సమస్యలు, నగరాభివృద్ధి, సంక్షేమంపై కేంద్రీకరించి   ప్రచారం చేస్తున్నారు. గుడిసెవాసుల్లో, కార్మికపేటల్లో సీపీఎంకు గట్టి ఓటు బ్యాంకున్నది.వివిధ సమస్యలపై పోరాడినా వాటిని ఓట్లుగా మార్చుకోలేకపోతున్నారు. సమైక్యవాదం ఈ పార్టీకి కొంత ఇబ్బందిగా మారనున్నది.
 
 
 
 ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాం నగరంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తా అండర్‌డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేస్తా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తా
 - బస్వరాజు సారయ్య
 
టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు పూర్తి చేయిస్తా స్పిన్నింగ్ మిల్లుల ఏర్పాటుకు కృషి ఐటీ రంగాభివృద్ధికి ప్రయత్నం చేస్తా
వరంగల్ నగరాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తా
 - కొండా సురేఖ
 
 అపెరల్ పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తా వరంగల్‌లో అండర్‌గ్ర   {yైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస బీడీ కార్మికుల సంక్షేమంపై దృష్టి
ఉర్సు ప్రసూతి ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతా  
 - రావు పద్మ
 
 నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా మురికివాడలులేని నగరంగా తీర్చిదిద్దుతా అర్హులకు సంక్షేమ ఫలాలు అందిస్తా అసంఘటిత కార్మికుల ఉపాధి కల్పన  విద్య, వైద్య వసతులపై కేంద్రీకరిస్తా
 - మెట్టు శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement