ఈ ఏడాదిలో లోక్‌సభ, అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకోవాలి.
- కడపలో ‘ఓటే మా బ్రహ్మాస్త్రం’
అనే అంశంపై నిర్వహించిన సదస్సులో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్
అన్న మాటలివి.
వైవీయూ, న్యూస్‌లైన్ : యువత ఓటుహక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పి. భన్వర్‌లాల్ అన్నారు. శనివారం నగర శివారులోని కేఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాలలో ఓటే మా బ్రహ్మాస్త్రం’ అన్న అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరంలో లోక్‌సభ, అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని ఈ ఎన్నికల్లో యువత ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. యువత ఓటుహక్కును వినియోగించుకుంటే మంచి ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కందుల శివానందరెడ్డి, డెరైక్టర్ కె.ఎస్.ఎన్.రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, డీఆర్‌ఓ ఈశ్వరయ్య, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యువతా..బీ రెడీ...
Published Sun, Jan 12 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM
Advertisement