ప్రణాళిక సిద్ధం చేసుకోండి
వారంలోగా పోలింగ్ కేంద్రాలను స్వయంగా పరిశీలించాలి
రాజకీయ పార్టీల పోస్టర్లను తొలగించాలి
మేనిఫెస్టోపై నివేదిక ఇవ్వాలి
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్
కలెక్టర్‌కు వీడియో కాన్ఫరెన్‌సలో ఆదేశాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ :
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఆయా నియోజకవర్గాలలోని పోలింగ్ కేంద్రాలను వారంలోగా స్వయంగా వెళ్లి పరిశీలించాలని సూచించారు. ఓటర్ల జాబితాను పోలింగ్ బూత్ గోడలపైన అతికించి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. రిటర్నింగ్ అధికారులు తమ జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను అనుసంధానం చేసి ఎన్నికల సంఘం వారికి అందించాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున రాజకీయ పార్టీలకు చెందిన పోస్లర్లు ,క్యాలెండర్లు,గోడ,కర ప్రతులు,హోర్డింగులు తొలగించాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎడల చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు.
రాజకీయ పార్టీలు తయారు చేసే మేనిఫెస్టోను ఎన్నికల అధికారులు పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. ప్రతిరోజు నివేదిక 10 గంటలలోగా అందించాలన్నారు. అక్రమంగా మద్యం పంపిణీ, మద్యం అమ్మకాలు, రవాణా జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీల తరపున బరిలో నిలబడే వ్యక్తులు అఫిడ విట్లు తప్పకుండా సమర్పించేలా చూడాలన్నారు. అభ్యర్థి నుంచి సేకరించిన అపిడ విట్లను వెంటనే ఎలక్షన్ కమిషన్‌కు అధికారులు పంపాలన్నారు.ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలపై దాడులు జరిగే అవకాశం ఉండే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని, సంబంధిత మ్యాపింగ్‌ను ఈనెల 13లోగా ఎన్నికల కమిషన్‌కు అందించాలన్నారు. వీడియె కాన్ఫరెన్స్‌లో ఎస్పీ తరుణ్‌జోషీ, డీఐజీ సూర్యనారాయణ,అదనపు జేసీ శేషాద్రి,ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికలు పకడ్బందీగానిర్వహించాలి
Published Fri, Mar 7 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement