కొలువు తీరనున్న కొత్త లోక్‌సభలో ముస్లింల ప్రాతినిధ్యం మరింత తగ్గింది. గత లోక్‌సభలో 30 మంది ముస్లిం సభ్యులుండగా, ఈ ఎన్నికల్లో 23 మంది ముస్లింలే గెలుపొందారు. వీరిలో హైదరాబాద్ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా మూడో సారి గెలుపొందిన అసదుద్దీన్ ఒవైసీ ఒకరు. అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రానున్న బీజేపీ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా విజయం సాధించకపోవడం గమనార్హం. 80 ఎంపీ సీట్లు, గణనీయ స్థాయిలో ముస్లింలు(19%) ఉన్న యూపీ నుంచి కూడా ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా పోటీలో నిలపలేదు. రాష్ట్రాలవారీగా పశ్చిమబెంగాల్ నుంచి 8 మంది, బీహార్ నుంచి నలుగురు, కేరళ నుంచి ముగ్గురు, జమ్మూకాశ్మీర్ నుంచి ముగ్గురు, అస్సాం నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, లక్షద్వీప్‌ల నుంచి ఒక్కొక్కరు లోక్‌సభలో ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.