![devendra fadnavis warns the bjp members to not contest elections from ljp - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/7/Chirag-Paswan.jpg.webp?itok=Y7DXiafu)
బిహార్: లోక్ జన్‌శక్తి పార్టీ తరపున ఎవరైనా పోటీ చేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని మహారాష్త్ర మాజీ ముఖ్యమంత్రి, బిహార్ ఎన్నికల ఇన్ఛార్జి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చారించారు. భాజపా నుంచి కొందరు రెబల్స్ ఎల్‌జేపీ తరుపున పోటీ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా ఎవరి పేర్లు బయటకు చెప్పనప్పటికీ ఈ హెచ్చరిక రెబల్స్‌కే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఫడ్నవీస్, బిహార్‌లో ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమారే అని వెల్లడించారు. ఎన్నికల తర్వాత భాజపా- ఎల్‌జేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఆరోపణలను ఆయన కొట్టిపడేసారు. ముఖ్యమంత్రి కావాలని చిరాగ్ పస్వాన్ ఆశిస్తున్నాడని, అది సాధ‍్యమయ్యే పని కాదని ఫడ్నవీస్ తెలిపారు.
మోది పేరు వాడొద్దు...
భాజపా రాష్త్ర అధ్యక్షుడు సంజయ జైశ్వాల్, బిహార్ ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ... బిహార్‌లో ఎన్డీయే తరపున పోటీ చేసే అభ్యుర్థులు కచ్చితంగా నితీశ్ కుమార్ నాయకత్వాన్ని ఆహ్వానించాలన్నారు. ఎన్డేయేతర అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోది పేరును వాడుకొని ఓట్లు అడిగే హక్కు లేదని, అలా చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment