పాశ్వాన్ ప్రతిపాదనకు కాంగ్రెస్ మద్దతు | Congress backs Chirag Paswan’s suggestion on Dalit quota | Sakshi

పాశ్వాన్ ప్రతిపాదనకు కాంగ్రెస్ మద్దతు

Apr 12 2016 3:51 PM | Updated on Sep 3 2017 9:47 PM

పాశ్వాన్ ప్రతిపాదనకు కాంగ్రెస్ మద్దతు

పాశ్వాన్ ప్రతిపాదనకు కాంగ్రెస్ మద్దతు

లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ సమర్థించింది.

పట్నా: సంపన్న దళితులు, ఇతర కులాల వారు స్వచ్ఛందంగా రిజర్వేషన్లు వదులుకోవాలని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. నిమ్నకులాలకు చెందిన సంపన్నులు తమకు తాముగా రిజర్వేషన్లు వదులుకుంటే అర్హులకు మరింత మేలు జరుగుతుందని కాంగ్రెస్ నేత అభిషేక్ మాను సింఘ్వి అన్నారు.

ముందుగా చిరాగ్ పాశ్వాన్ తన రిజర్వేషన్ వదులుకోవాలని జేడీ(యూ) నేత పాశ్వాన్ వర్మ సూచించారు. తాను ఆచరించి ఇతరులకు చెబితే బాగుంటుందని అన్నారు. గ్యాస్ సబ్సిడీ వదులుకుంటున్నగా ఆర్థికంగా నిలదొక్కుకున్న నిమ్నవర్గాల వారు రిజర్వేషన్లు వదులుకోవాలని చిరాగ్ పాశ్వాన్ సోమవారం వ్యాఖ్యానించారు. కులవ్యవస్థలేని సమాజం రావాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement