ఏ పార్టీకైనా, కూటమికైనా తన సపోర్ట్ కావాల్సిందేనని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ అన్నారు. తన మద్దతు కోసం వివిధ పార్టీలు పోటీపడుతున్నాయని, వీటిలో ‘గౌరవప్రదమైన’ ఆఫర్ ఇచ్చే పార్టీలతోనే తన పొత్తు ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు.
ప్రస్తుతం ఎన్‌డీఏ మిత్రపక్షంగా పాశ్వాన్‌కు బిహార్ ప్రతిపక్ష కూటమి 'మహాఘఠ్ బంధన్' నుండి ఆహ్వానం అందినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది. సాహెబ్‌గంజ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో జరిగిన ర్యాలీలో చిరాగ్ మాట్లాడుతూ "చిరాగ్ పాశ్వాన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉన్న మీడియా వ్యక్తులను ఇక్కడ చూస్తున్నాను. చిరాగ్ పాశ్వాన్ కేవలం బిహార్ ప్రజలతో మాత్రమే పొత్తు పెట్టుకుంటాడని వారికి చెప్పాలనుకుంటున్నాను" అన్నారు.
తన తండ్రి దివంగత రామ్ విలాస్ పాశ్వాన్‌కు నిజమైన వారసుడిగా తనను తాను "షేర్ కా బేటా" అని చిరాగ్ చెప్పుకొన్నారు. తమ పార్టీని చీల్చిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్‌ల పేర్లు ఎత్తకుండానే తన ఇల్లు, కుటుంబం, పార్టీని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment