- ఎల్‌జేపీ నేతపై కేసు నమోదు
పాట్నా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభ్యంతరకంగా ఉన్నట్లు చూపే చిత్రాలను సామాజిక అనుసందాన వే దిక(వాట్స్‌యాప్)లో పెట్టిన బిహార్ ఎల్‌జే పీ నేత ఉమా శంకర్ మిశ్రాపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమా శంకర్ తన మొబైల్ ద్వారా స్మృతి ఇరానీ చిత్రాలను వాట్స్‌యాప్‌లో పెట్టడమే కాకుండా తమ నేతలకు కూడా పంపాడని స్థానిక బీజేపీ నేత రాజీవ్ రంజన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేశామని రాజీవ్ తెలిపారు.
స్మృతి ఇరానీ, బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని రాజీవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడైన ఉమా శంకర్ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్‌జేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ను కోరారు. సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసుపై విచారణను మొదలుపెట్టారు.