Uma Shankar
-
అయ్యన్న ఎన్ని కుయుక్తులు పన్నినా నర్సీపట్నాన్ని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే ఉమాశంకర్
-
అయ్యన్న అక్రమ నిర్మాణంపై ప్రజల దృష్టి మరల్చే టీడీపీ ఎత్తుగడ
-
లాటరైట్ దోపిడీ దొంగ అయ్యన్నపాత్రుడు : ఎమ్మెల్యే ఉమాశంకర్
-
దిగజారుడు రాజకీయాలు చేస్తున్న టీడీపీ: ఉమాశంకర్
-
‘పవన్‌తో ప్రజలకు ప్రయోజనం నిల్’
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని చింతకాయల సన్యాసిపాత్రుడు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడైన సన్యాసిపాత్రుడు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి పార్టీలో చేరానని, పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల పనుల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించడం సంతోషమని, నర్సీపట్నంలో పార్టీ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. సన్యాసిపాత్రుడు నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. పవన్ టీడీపీ దత్త పుత్రుడు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ ఇతర పార్టీ పట్ల ప్రజావిశ్వాసం లేదని, అందుకే పార్టీలోకి నేతలు వలసలు వస్తున్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నవరత్నాలు, సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మేలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. పవన్‌ది లాంగ్ మార్చ్ కాదు.. రాంగ్ మార్చ్ అని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ నడుస్తాడనుకున్నా.. కానీ సినిమా ఫక్కీలో అందర్నీ నడిపించి ఆయన మాత్రం కారుపై ఎక్కాడని ఎద్దేవా చేశారు. పవన్ టీడీపీ దత్తపుత్రుడని, చంద్రబాబు డైరెక్షన్లో పవన్ యాక్షన్ అని వ్యంగ్యంగా విమర్శించారు. పవన్ జీవితాన్ని చంద్రబాబుకు అర్పించాడని, లైఫ్ టైమ్ కాల్ షీట్స్ బాబుకు ఇచ్చేశాడని అన్నారు. పవన్ కల్యాణ్‌తో ప్రజలకు ఉపయోగం లేదని, ఆయన ఢిల్లీ నేతలను కలిసినా, అమెరికా అధ్యక్షున్ని కలిసి మాట్లాడినా ప్రజలు నమ్మరని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. అయిదేళ్లలో చేయాల్సిన అభివృద్ధిని సీఎం వైఎస్ జగన్ అయిదు నెలల్లో చేశారని ప్రస్తావించారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారన్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా వంటి అద్భుతమైన పథకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. -
‘మంగాయమ్మ, పిల్లలు క్షేమంగా ఉన్నారు’
సాక్షి, గుంటూరు : 74 ఏళ్ల వయసులో కవలపిల్లలకు జన్మనిచ్చిన మంగాయమ్మ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని ఆమెకు ప్రసవం చేసిన డాక్టర్ ఉమాశంకర్ తెలిపారు. ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన అతి పెద్ద మహిళగా మంగాయమ్మ రికార్డు నెలకొల్పారు. ఆమెకు గుంటూరు అహల్యా ఆస్పతిలో ఉమాశంకర్ నేతృత్వంలోని వైద్యుల బృందం గురువారం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. అనంతరం ఉమాశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. సంతానం కోసం మంగాయమ్మ దంపతులు గతేడాది నవంబర్ 12న తమ ఆస్పత్రికి వచ్చినట్టు చెప్పారు. మంగాయమ్మ ఆరోగ్యంగా ఉండటంతో ఐవీఎఫ్ ద్వారా గర్భం కోసం ప్రయత్నించినట్టు వెల్లడించారు. అయితే గర్భం దాల్చిన తరువాత మంగాయమ్మకు ఆహారం విషయంలో కొంత ఇబ్బంది ఎదురైందని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆమెకు ప్రత్యేక వైద్యం అందించినట్టు వివరించారు. 10 మంది వైద్యులు మూడు బృందాలుగా విడిపోయి.. రాత్రింబవళ్లు కష్టపడి విజయం సాధించినట్టు పేర్కొన్నారు. ఒక పద్దతి ప్రకారం చికిత్స చేయడం వల్లే వైద్య రంగంలో అద్భుతమైన విజయం సాధించామన్నారు. నేడు గురుపూజోత్సవం కావడంతో ఈ విజయాన్ని తన గురువులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు. చదవండి : కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ -
అయ్యన్న మతితప్పి మాట్లాడుతున్నారు..
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుపై నర్సీపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అయ్యన్న చౌకబారు మాటలను తగ్గించుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బెదిరింపు ధోరణి సరికాదంటూ ఉమాశంకర్ ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలతో దూసుకెళుతున్న తమ ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ మద్దతుందన్నారు. టీడీపీ అధికారంలో లేని విషయాన్ని అయ్యన్న గుర్తించుకోవాలని హితవు పలికారు. -
ఆదాయంలో ధనాధన్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఆదాయంలో దూసుకుపోతోంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో ఆదాయంలో గణనీయమైన పురోగతి సాధించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ 6 నెలల కాలంలో దాదాపు రూ.846 కోట్ల ఆదాయంతో ఏకంగా 18 శాతం వృద్ధిరేటు కనబరచడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దక్షిణ మధ్య రైల్వే ప్యాసింజర్, సరుకు రవాణాలను కలిపి రూ.7,017 కోట్ల ఆదాయం సాధించింది. ఇదేకాలానికి 2017లో వచ్చిన ఆదాయం రూ.6,171 కోట్లు కావడం గమనార్హం. ఆదాయ వృద్ధిరేటు 18 శాతానికి చేరడం శుభపరిణామమని, మునుముందు మరింత పురోగతి సాధిస్తామని అధికారులు అంటున్నారు. కారణాలివే.. దక్షిణ మధ్య రైల్వేకు ఆదాయం పెరగడానికి కారణాలను సీపీఆర్వో ఉమాశంకర్ వివరించారు. తమ జీఎం వినోద్‌కుమార్ నేతృత్వంలో అంతా ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ 10 లక్షల మందికి సేవలందించే దక్షిణ మధ్య రైల్వేను ప్రయాణికులకు మరింతగా దగ్గర చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. రాబోయే 6 నెలల్లోనూ మరిన్ని లాభాలు సాధించేందుకు రైల్వేలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నామని స్పష్టంచేశారు. వాటిలో ప్రధానమైనవి.. ప్రయాణికుల పరంగా.. - పలు దూర ప్రాంతాలకు రైళ్ల పొడిగింపు, హైదరాబాద్‌లో శేరిలింగంపల్లి టెర్మినల్ అభివృద్ధి చేయడం, అక్కడ నుంచి 6 కొత్త రైళ్లు నడపడం. - రద్దీకి అనుగుణంగా రైళ్లు, పర్వదినాల్లో ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలు వేయడం - టికెట్ రహిత ప్రయాణంపై అవగాహన, దాడులు నిర్వహించడం - అన్ని రైల్వేస్టేషన్లలో భద్రతా, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం రవాణా విషయంలో - గూడ్స్ ట్రెయిన్ల వేగం పెంచడం, బొగ్గు, సిమెంటు తదితర పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను గడువులోగా గమ్యాన్ని చేర్చడం. - ఉత్పత్తుల రవాణాలో ప్రైవేటు కంపెనీలకు ఫ్లెక్సిబిలిటీని ఇవ్వడం. - వ్యాగన్ల సామర్థ్యాన్ని 58 నుంచి 65 టన్నులకు పెంచడం, రైళ్ల సామర్థ్యాన్ని కూడా 52 వ్యాగన్ల నుంచి 60కిపైగా వ్యాగన్లకు పెంచడం. -
ఫిజికల్ టీచర్ల నూతన కమిటీ
అనంతపురం రూరల్ : పట్టణంలోని ఉపాధ్యాయ భవన్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా సిరాజుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా కుమార్రాజు, కోశాధికారిగా ఏవీ శివారెడ్డి, అధికార ప్రతినిధిగా రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు చిన్నరెడ్డెప్ప, శకుంతలాదేవి, సతీష్‌బాబు, సహాయ కార్యదర్శులుగా ప్రతాప్‌రెడ్డి, చామంతి, ఉమాశంకర్‌ను ఎన్నుకున్నారు. -
వాట్స్ యాప్‌లో స్మృతిపై అభ్యంతరకర చిత్రాలు
ఎల్జేపీ నేతపై కేసు నమోదు పాట్నా: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభ్యంతరకంగా ఉన్నట్లు చూపే చిత్రాలను సామాజిక అనుసందాన వే దిక(వాట్స్‌యాప్)లో పెట్టిన బిహార్ ఎల్జే పీ నేత ఉమా శంకర్ మిశ్రాపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమా శంకర్ తన మొబైల్ ద్వారా స్మృతి ఇరానీ చిత్రాలను వాట్స్‌యాప్‌లో పెట్టడమే కాకుండా తమ నేతలకు కూడా పంపాడని స్థానిక బీజేపీ నేత రాజీవ్ రంజన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేశామని రాజీవ్ తెలిపారు. స్మృతి ఇరానీ, బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని రాజీవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడైన ఉమా శంకర్ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎల్జేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ను కోరారు. సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసుపై విచారణను మొదలుపెట్టారు. -
ఎంత...ఘోరం
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం గుడికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు.. కేఎల్ఎం హాస్పిటల్ (రేణిగుంట) : ఉదయం కుటుంబ సభ్యులంతా ఆనందంగా గడిపారు. గుడికి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై తల్లి, కొడుకు, ఆమె తమ్ముడు బ యలుదేరారు. 45 నిమిషాలు గడవగానే మృత్యువు రూపంలో లారీ ఎదురొచ్చింది. తల్లీకొడుకును పొట్టన పెట్టుకుంది. ఈ సంఘటన రేణిగుంట మండలం కేఎల్ఎం హాస్పిటల్ సర్కిల్ వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. బాలాజీ (12) అక్కడికక్కడే మృతిచెందగా, అమరావతి (40) తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. మృతులు ఏర్పేడు మండలం, చింతపాళెంవాసులు. అమరావతి తమ్ముడు ఉమాశంకర్ స్పల్పగాయూలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అసలు ఏం జరిగిందంటే... ఏర్పేడు మండలం చింతపాళెం దళితవాడకు చెందిన కృష్ణయ్య అతని భార్య అమరావతి తిరుపతి రూరల్ మండలంలోని పుదిపట్లలో ఏడో తరగతి చదువుతున్న వారి కుమారుడు బాలాజీకి ఆరోగ్యం సరిలేద ని గురువారం చూసేందుకు వెళ్లారు. రేణిగుంట మం డలం అత్తూరులోని గుడికి వెళ్లేందుకు అమరావతి, బాలాజీ, ఆమె తమ్ముడు ఉమాశంకర్‌తో ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. కేఎల్ఎం హాస్పిటల్ వద్దకు రాగానే ఎదురుగా తిరుపతి వైపు వెళ్తున్న లారీ ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. బాలాజీ అక్కడికక్కడే మరణించాడు. అమరావతి తీవ్రంగా గాయపడగా, ఉమాశంకర్ స్వల్పంగా గాయపడ్డారు. వీరిని 108లో తిరుపతి రుయూ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అమరావతి మృతి చెందింది. స్థానికులు, గాజులమండ్యం పోలీసులు వెంటాడి లారీని పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. డ్రయివర్ను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ ఎస్ఐ సుబ్రమణ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాగా చదువుకుంటాడనుకున్నా : రోదిస్తున్న మృతుని తండ్రి బాగా చదివి కుటుంబాన్ని కాపాడతావనుకుంటే ఇలా జరిగిందేమిటి నాయనా అంటూ బాలాజీ తండ్రి కృష్ణయ్య బోరున విలపించారు. కృష్ణయ్యకు ముగ్గురు కుమార్తెలు,కుమారుడు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. కృష్ణయ్య తిరుపతిలోని ఓ ప్రముఖ హోటల్లో లిఫ్ట్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు.