
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుపై నర్సీపట్నం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అయ్యన్న చౌకబారు మాటలను తగ్గించుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బెదిరింపు ధోరణి సరికాదంటూ ఉమాశంకర్ ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలతో దూసుకెళుతున్న తమ ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణ మద్దతుందన్నారు. టీడీపీ అధికారంలో లేని విషయాన్ని అయ్యన్న గుర్తించుకోవాలని హితవు పలికారు.