
సాక్షి,విశాఖపట్నం: రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కోమరియన్ రీజన్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నందున వర్షాలు పడతాయని వెల్లడించింది.
రాయలసీమలో మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30-40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.