
సాక్షి,విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం(అక్టోబర్14) అల్పపీడనం ఏర్పడింది. రేపటికి ఈ అల్పపీడనం తీవ్రరూపం దాల్చే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది.
అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి 35- 45కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి.
